Ap Assembly: జులైలో ఏపీ అసెంబ్లీ సమావేశాలు

జులై మూడో వారంలో ఏపీ అసెంబ్లీ సమావేశాలు నిర్వహించే అవకాశాలున్నట్లు సమాచారం. ప్రభుత్వం త్వరలోనే సమావేశ తేదీలను వెల్లడించనుంది.ఆగస్టు నుంచి వచ్చే ఏడాది మార్చి నెలాఖరు వరకు పూర్తి స్థాయి బడ్జెట్ ను బాబు ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టనుంది.

New Update
AP Assembly Meet: ఈ నెల 22 నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు

AP Assembly Sessions: ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఏపీ అసెంబ్లీ సమావేశాలు రెండు రోజుల పాటు జరిగాయి. ప్రొటెం స్పీకర్ గా ఎన్నికైన గోరంట్ల బుచ్చయ్య చౌదరి (Gorantla Butchaiah Chowdary) కొత్తగా అసెంబ్లీకి ఎన్నికైన ఎమ్మెల్యేలతో ఆయన ప్రమాణం చేయించారు. రెండో రోజు స్పీకర్ గా టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు (Ayyannapatrudu) ఏకగ్రీవంగా ఎన్నికైన సంగతి తెలిసిందే. ఇలా అసెంబ్లీ సమావేశాలు సభ్యుల ప్రమాణం, స్పీకర్ ఎన్నికతో సమావేశాలు ముగిశాయి. అయితే ఏపీ అసెంబ్లీ వచ్చే నెల మరోసారి సమావేశం కానున్నట్లు అధికారిక సమాచారం.

జులై (July) మూడో వారంలో ఏపీ అసెంబ్లీ సమావేశాలు నిర్వహించే అవకాశాలున్నట్లు సమాచారం. ప్రభుత్వం త్వరలోనే సమావేశ తేదీలను వెల్లడించనుంది. గత ప్రభుత్వం ఎన్నికల కారణంగా పూర్తి స్థాయి బడ్జెట్ ను (AP Budget) ప్రవేశపెట్టలేదు. వైసీపీ సర్కార్ ప్రవేశపెట్టిన ఓటాన్ అకౌంట్ బడ్జెట్ గడువు జులైతో పూర్తవుతుంది.

ఆగస్టు నుంచి వచ్చే ఏడాది మార్చి నెలాఖరు వరకు పూర్తి స్థాయి బడ్జెట్ ను బాబు ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టనుంది. గత ప్రభుత్వం చేసిన అప్పులు, కార్పొరేషన్ లోన్లు, ఇతరత్రా ఆదాయం, అప్పుల చిట్టా వివరాలు ఓ కొలిక్కి వచ్చాక.. కూటమి ప్రభుత్వం అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టాలని ఆలోచనలో ఉంది. ఆ బడ్జెట్ ఆమోదం కోసం జులై మూడో వారంలో ఏపీ అసెంబ్లీ సమావేశాలు నిర్వహించనున్నారు.

Also Read: రైల్వే ప్రయాణికులకు గుడ్‌ న్యూస్..ప్రత్యేక సర్వీసులు పొడిగింపు..ఆ రైళ్లు..!

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు