Anupama Parameswaran On Bold Scenes In Tillu Square: టాలీవుడ్ యంగ్ హీరో సిద్దూ జొన్నలగడ్డ (Siddu Jonnalagadda), కర్లీ బ్యూటీ అనుపమ జంటగా నటిస్తున్న లేటెస్ట్ చిత్రం 'టిల్లు స్క్వేర్'. డీజే టిల్లుతో సూపర్ హిట్ కొట్టిన సిద్దు ఇప్పుడు టిల్లు స్క్వేర్ (Tillu Square) తో రాబోతున్నాడు. ఇప్పటికే విడుదలైన ఈ మూవీ ట్రైలర్ , టీజర్, మూవీకి విపరీతమైన హైప్ క్రియేట్ చేశాయి. ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ చిత్రం మార్చి 29న విడుదల కానుంది.
Also Read: Magadheera: చెర్రీ ఫ్యాన్స్ కు పూనకాలే .. మగధీర రీ రిలీజ్ డేట్ ఫిక్స్..!
ఇది ఇలా ఉంటే.. తాజాగా జరిగిన ఈ మూవీ ప్రెస్ మీట్ లో బోల్డ్ క్యారెక్టర్స్ పై అనుపమ చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారాయి. ఆఆ, శతమానం భవతి వంటి సినిమాల్లో క్లాస్ గా కనిపించిన అనుపమ 'టిల్లు స్క్వేర్' మాత్రం కాస్త గ్లామర్ డోస్ పెంచేసింది. అయితే ఈ సినిమాలో ఇలాంటి పాత్ర ఎంచుకోవడానికి కారణం ఏంటి అనే విషయాన్నీ తెలిజేసింది.
అనుపమ కామెంట్స్
నటిగా ఇన్నేళ్లు చేసిన పాత్రలే మళ్ళీ మళ్ళీ చేయడం బోర్ కొట్టేసింది. 'టిల్లు స్క్వేర్' లో లిల్లీ పాత్ర వదులుకోవడం అనేది పిచ్చి పని అవుతుంది. కమర్షియల్ సినిమాల్లో అమ్మాయికి ఇంత మంచి రోల్ దొరకడం చాలా రేర్. అందుకే ఈ క్యారెక్టర్ వదులుకోవాలని అనుకోలేదు అని చెప్పింది.
అయితే అనుపమ పాత్ర గురించి క్లారిటీ ఇచ్చినప్పటికీ.. మళ్ళీ అలాంటి ప్రశ్నే అడిగేసరికి బిర్యానీ, పులిహోర అంటూ ఉదాహరణ చెప్పి గట్టిగా కౌంటర్ ఇచ్చింది. మీకు బిర్యానీ అంటే బాగా ఇష్టం ఉంటుంది. అలా అని డైలీ బిర్యానీ తినలేరు.. వేరే వెరైటీస్ ట్రై చేస్తారు. అలాగే నాకు కూడా డిఫరెంట్ గా పులావ్ కావలి, పులిహోర కావాలి అంటూ టిల్లు స్క్వేర్' తన గ్లామర్ పాత్రను ఉద్దేశించి ఇండైరెక్ట్ గా కౌంటర్ ఇచ్చింది.
Also Read: Ram Charan: క్లీంకారతో ఎంజాయ్ చేస్తున్న చరణ్.. వైరలవుతున్న వీడియో