BRS Party: బీఆర్ఎస్‌కు మరో షాక్‌.. కాంగ్రెస్‌లోకి మరో నేత?

సీఎం రేవంత్‌రెడ్డిని GHMC డిప్యూటీ మేయర్ శ్రీలత శోభన్ రెడ్డి దంపతులు కలిశారు. కాంగ్రెస్‌ పార్టీలో డిప్యూటీ మేయర్ దంపతులు చేరబోతన్నట్లు సమాచారం. మొన్ననే మాజీ డిప్యూటీ మేయర్ బాబా ఫసీయుద్దీన్ కాంగ్రెస్‌లో చేరిన విషయం తెలిసిందే.

New Update
BRS Party: బీఆర్ఎస్‌కు మరో షాక్‌.. కాంగ్రెస్‌లోకి మరో నేత?

Srilatha Shoban Reddy Met CM Revanth Reddy: తెలంగాణ ఎన్నికల ఫలితాల్లో భారీ ఎదురుదెబ్బ తగిలిన బీఆర్ఎస్ పార్టీకి.. ఇప్పుడు సొంత పార్టీల నేతలను కాపాడుకోవడమే పెద్ద తలనొప్పిగా మారింది. అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీలోకి ఎప్పుడు, ఎవరు జంప్ అవుతారనే టెన్షన్ బీఆర్ఎస్ పార్టీలో కొనసాగుతోంది. ఇదిలా ఉండగా తాజాగా బీఆర్ఎస్ పార్టీకి మరో షాక్ తగలనున్నట్లు తెలుస్తోంది.

అధికారపార్టీలోకి క్యూ కడుతున్నారు BRS నేతలు. సీఎం రేవంత్‌రెడ్డిని GHMC డిప్యూటీ మేయర్ శ్రీలత శోభన్ రెడ్డి దంపతులు కలిశారు. కాంగ్రెస్‌ పార్టీలో (Congress Party) డిప్యూటీ మేయర్ దంపతులు చేరబోతన్నట్లు సమాచారం. మొన్ననే మాజీ డిప్యూటీ మేయర్ బాబా ఫసీయుద్దీన్ కాంగ్రెస్‌లో చేరిన విషయం తెలిసిందే. రేపోమాపో కాంగ్రెస్‌ గూటికి మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ (Bonthu Rammohan) కూడా వెళ్లనున్నట్లు తెలుస్తోంది.

ALSO READ: బీజేపీతో కేసీఆర్ కుమ్మక్కు… మేడిగడ్డ పనికిరాదు.. సీఎం రేవంత్ గరం

రేవంత్ తో బొంతు...

సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) తో బీఆర్ఎస్ నేత, మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ భేటీ అయ్యారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నివాసంలో సమావేశం అయ్యారు. కొంతకాలంగా బీఆర్ఎస్ పార్టీపై (BRS Party) ఆయన అసంతృప్తిగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇటీవల రేవంత్‌ని పలువురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, నేతలు కలిసిన విషయం తెలిసిందే. ఈ భేటీలపై గులాబీ బాస్ కేసీఆర్ వారిపై సీరియస్ అయ్యారు. సీఎం ఇంటికెళ్లి కలవడం సరికాదని హితవు పలికారు. కేసీఆర్ (KCR) వార్నింగ్ తర్వాత కూడా రేవంత్‌ని బొంతు రామ్మోహన్ కలవడంపై త్వరలో ఆయన కాంగ్రెస్ లో చేరనున్నట్లు ప్రచారం జోరందుకుంది.

Advertisment
Advertisment
తాజా కథనాలు