ఒడిశాలో పూరీ జగన్నాథుడి ఆలయ రత్న భాండాగారం 46 ఏళ్ల తర్వాత తెరుచుకున్న సంగతి తెలిసిందే. అయితే రత్న భాండాగారంలో మరో రహస్య గది ఉన్నట్లు పలువురు చరిత్రాకారులు తెలిపారు. జగన్నాథుడి అసలైన సంపద ఆ గదిలో ఉందా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. గురువారం ఈ మూడో రహస్య గది తెరుచుకోనుంది. దీంతో ఈ గదిలో ఏం ఉంటుందనే దానిపై దేశవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది.
Also read: అమెరికా ఉపాధ్యక్ష అభ్యర్థి భార్య ఉషా చిలుకూరి.. ఏపీలో మూలాలు
అయితే ఆ రహస్య గదిలోకి సొరంగ మార్గం నుంచి వెళ్లాల్సి ఉంటుందని.. అందులోనే విలువైన సంపద ఉంటుందని చరిత్రకారులు చెబుతున్నారు. 1902లో బ్రిటీష్ ప్రభుత్వం కూడా ఈ సొరంగాన్ని కనిపెట్టేందుకు ప్రయత్నించి విఫలమైందని.. ఆ సొరంగాన్ని, రహస్య గదిని బ్రిటీష్ పాలకులు కనిపెట్టలేకపోయారని అంటున్నారు. సొరంగం కనిపెట్టిందుకు వెళ్లిన ఓ వ్యక్తి కూడా అదృశ్యమయ్యాడని.. దీంతో బ్రిటీషర్లు తమ ప్రయత్నాన్ని ఆపేసినట్లు తెలిపారు.
ఒడిశాకు చెందిన ప్రముఖ చరిత్రకారుడు నరేంద్ర కుమార్ దీనికి సంబంధించి కీలక విషయాలు వెల్లడించారు. 'రాజా కపిలేంద్రదేవ్.. తూర్పు, దక్షిణ ప్రాంతాలపై దండెత్తి కొంతమంది రాజులను ఓడించారు. వాళ్ల నుంచి తీసుకొచ్చిన సంపదను తన కొడుకు పురుషోత్తముడికి సమర్పించినట్లు చారిత్రక ఆధారాలున్నాయి. ఆ తర్వాత పురుషోత్తం దేవ్ పాలనలో కూడా స్వామివారికి అపార సంపద వచ్చింది. ఆ సమయంలో రత్నా భాండాగారం దిగువన సొరం మార్గాన్ని తవ్వి ఆభరణాలను భద్రపరిచేందుకు రహస్య గదిని నిర్మించారు. వీటిలో 34 కిరీటాలు, రత్నాలు పొదిగిన స్వర్ణ సింహాసనాలు, మహాలక్ష్మి అమ్మవారి వడ్డనాలు, అలాగే కొలువు దేవతల పసిడి విగ్రహాలు ఉన్నాయని' నరేంద్ర కుమార్ తెలిపారు. అయితే రేపు రహస్య గదికి సొరంగ మార్గం ద్వారా చేరుకుంటారా లేదా వేరే మార్గంలో చేరుకుంటారా అనేదానిపై ఆసక్తి నెలకొంది.
Also read: ధోతీ ధరించాడని రైతును షాపింగ్ మాల్‌లోకి రానివ్వలేదు