విపక్ష కూటమి కన్వీనర్ రేసులో మరో నేత... తెరపైకి కొత్త పేరు....! విపక్ష ఇండియా కూటమికి కన్వీనర్‌గా ఎవరు ఉండాలనే విషయంలో భిన్న అభిప్రాయాలు వెలుపడుతున్నాయి. తాజాగా కన్వీనర్ పదవికి మరో పేరు తెరపైకి వచ్చింది. ఈ పదవికి ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ పేరును ఆప్ ప్రతినిధి ప్రియాంక కక్కర్ ప్రతిపాదించారు. విపక్ష కూటమిని ఆయనైతేనే సరిగా నడిపించలగరని ఆమె అభిప్రాయం వ్యక్తం చేశారు. By G Ramu 30 Aug 2023 in నేషనల్ New Update షేర్ చేయండి విపక్ష ఇండియా కూటమికి కన్వీనర్‌గా ఎవరు ఉండాలనే విషయంలో భిన్న అభిప్రాయాలు వెలుపడుతున్నాయి. తాజాగా కన్వీనర్ పదవికి మరో పేరు తెరపైకి వచ్చింది. ఈ పదవికి ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ పేరును ఆప్ ప్రతినిధి ప్రియాంక కక్కర్ ప్రతిపాదించారు. విపక్ష కూటమిని ఆయనైతేనే సరిగా నడిపించలగరని ఆమె అభిప్రాయం వ్యక్తం చేశారు. కూటమి కన్వీనర్ పదవికి రోజుకో పేరు తెరపైకి వస్తోంది. మొదట బిహార్ సీఎం నితీశ్ కుమార్ తెరపైకి వచ్చింది. కూటమి కన్వీనర్ పదవిని ఆయన కోరుకుంటున్నారని మొదట్లో వార్తలు వచ్చాయి. ఈ క్రమంలో ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. తాను ఎలాంటి పదవులు కోరుకోవడం లేదని వెల్లడించారు. విపక్ష పార్టీలను ఏకతాటి పైకి తీసుకు రావడమే తన లక్ష్యమని వెల్లడించారు. ఈ క్రమంలో ఆయన పోటీ నుంచి తప్పుకున్నట్టేనని తేలి పోయింది. దీంతో విపక్ష కూటమికి మల్లిఖార్జున ఖర్గే లేదా కాంగ్రెస్ కు చెందిన నేత సారథ్యం వహించాలని జేడీయూ నేతలు కీలక వ్యాఖ్యలు చేశారు. దానికి మరికొన్ని పార్టీలు కూడా వంత పాడాయి. ఇక కన్వీనర్ గా మల్లిఖార్జున ఖర్గే నియామకం లాంఛన ప్రాయమేనన్నారు. కానీ తాజాగా అనూహ్యంగా అరవింద్ కేజ్రీవాల్ తెరపైకి వచ్చింది. ఢిల్లీ ముఖ్యమంత్రి నిరంతరం ప్రజల సమస్యలను లేవనెత్తారని, దేశ రాజధానిలో ద్రవ్యోల్బణం అత్యల్పంగా ఉన్న ఒక నమూనాను అందించారని ప్రియాంక కక్కర్ అన్నారు. ప్రజా సంక్షేమం కోసం పని చేస్తున్న నేత అరవింద్ కేజ్రీవాల్ అని ఆమె అన్నారు. విపక్ష కూటమి మూడవ సమావేశం జరగనున్న నేపథ్యంలో అరవింద్ కేజ్రీవాల్ పేరు తెరపైకి రావడం ప్రాధాన్యత సంతరించుకుంది. also read: మీరెవ్వరూ నాకొద్దు..సింహం సింగిల్ గానే బరిలోకి.!! #india #nitish-kumar #aap #cm-kejriwal #mallikarjuna-kharge మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి