Khalistan Graffiti: అమెరికా, కెనడాల్లో ఖలిస్తానీ మద్దతుదారుల ఆగడాలు తగ్గడం లేదు. వరుసపెట్టి వీరు హిందూ దేవాలయాల మీద దాడులు చేస్తూనే ఉన్నారు. తాజాగా మరోసారి కాలిషోర్నియాలోని ఓ దేవాలయం మీద ఖలిస్తానీకి మద్దతుగా నినాదాలు రాశారు. కాలీఫోర్నియాలోని హేవార్డ్‌లో (Hayward) ఉన్న స్థానిక హిందూ విజయ్ షెరావాలి దేవాలయంపై గ్రాఫైట్ తో ఖలిస్థానీ నినాదాలు (Khalistan Slogans) రాశారు. ఈ విషయాన్ని హిందూ అమెరికా షౌండేషన్ ధృవీకరించింది. మోదీ టెర్రరిస్ట్..ఖలిస్తానీ జిందాబాద్ అంటూ నినాదాలు దేవాలయం బోర్డు మీద కనిపించాయి. ఈ ఘటనపై విజయ్ షెరావలి దేవాలయం అధికారులు...అల్ మెడా పోలీసులకు కంప్లైంట్ చేశారు. దీనిపై దర్యాప్తు చేస్తామని అక్కడి పోలీసులు తెలిపారు.
Also read:అరేబియా మహాసముద్రంలో 15 మంది భారతీయులన్న షిప్ హైజాక్
ఇంతకు ముందు కూడా...
ఇంతకు ముందు కాలిఫోర్నియాలోనే మరో ఆలయం మీద కూడా ఖలిస్తానీ మద్దుతుదారులు దాడి చేశారు. కాలిఫోర్నియా(California) లోని నెవార్క్ లో ఉన్న స్వామినారాయణ టెంపుల్ మీద దాడి చేశారు. ఆలయ గోడలపై ఖలిస్థాన్‌కి మద్దతుగా రాతలు రాశారు. గ్రాఫిటీతో భారత్‌కి వ్యతిరేకంగా స్లోగన్స్ రాశారు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు విచారణ మొదలు పెట్టారు. ఇప్పటికే పలు దేశాల్లో ఇలా భారత్‌కి వ్యతిరేకంగా హిందూ ఆలయాలపై దాడులు జరిగాయి. ముఖ్యంగా యూకే, ఆస్ట్రేలియాలో ఇలాంటివి వెలుగు చూశాయి.
భారత కాన్సులేట్‌కు నిప్పు...
ఖలిస్తానీ మద్దతుదారులు జూలై 2న శాన్ ఫ్రాన్సిస్కోలోని భారత కాన్సులేట్‌కు నిప్పు పెట్టారు. శాన్‌ఫ్రాన్సిస్కో అగ్నిమాపక శాఖ వెంటనే మంటలను అదుపులోకి తెచ్చింది. అయితే ఈ ఘటనలో పెద్దగా నష్టం వాటిల్లలేదు. ఆదివారం తెల్లవారుజామున 1.30 నుంచి 2.30గంటల మధ్య ఖలిస్తానీ మద్దతుదారులు నిప్పు పెట్టారని ఆమెరికా స్థానిక ఛానెల్ దియాటీవీ నివేదించింది. ఈ ఘటన గురించి సమాచారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అగ్నిప్రమాదం వల్ల ఎలాంటి నష్టం జరగలేదని నివేదికలో పేర్కొన్నారు. అదే సమయంలో ఈ ఘటనలో ఉద్యోగులు ఎవరూ కూడా గాయపడలేదని తెలిపింది.