Telangana: ఇంజినీరింగ్ చేయాలనుకునేవారికి గుడ్‌న్యూస్.. మరో 9 వేల సీట్లు తెలంగాణలో కొత్తగా మరో 9 వేల ఇంజినీరింగ్ సీట్లు అందుబాటులోకి రానున్నాయి. జులై 26 నుంచి రెండో విడత కౌన్సెలింగ్ ప్రారంభమైంది. 27,28వ తేదీల్లో వెబ్ ఆప్షన్ల ప్రక్రియ ఉంటుంది. ఈ నేపథ్యంలో శుక్రవారం లేదా శనివారం ఉదయం కొత్త సీట్లకు రాష్ట్ర విద్యాశాఖ పర్మిషన్ ఇవ్వనుంది. By B Aravind 26 Jul 2024 in Latest News In Telugu తెలంగాణ New Update షేర్ చేయండి తెలంగాణలో కొత్తగా మరో 9 వేల ఇంజినీరింగ్ సీట్లు అందుబాటులోకి రానున్నాయి. జులై 26 నుంచి రెండో విడత కౌన్సెలింగ్ ప్రారంభమైంది. 27,28వ తేదీల్లో వెబ్ ఆప్షన్లు ఎంచుకునే ప్రక్రియ ఉంటుంది. ఈ నేపథ్యంలోనే శుక్రవారం లేదా శనివారం ఉదయం కొత్త సీట్లకు రాష్ట్ర విద్యాశాఖ పర్మిషన్ ఇవ్వనుంది. డిమాండ్ లేని బ్రాంచీల స్థానంలో సీఎస్‌ఈ తదితర బ్రాంచీల నుంచి 7 వేల సీట్లు, అదనపు సీట్లతో కలిపి కొత్తగా 20,500 సీట్లు అందుబాటులోకి రావాలి. ఇందుకు ఏఐసీటీఈ కూడా ఆమోదం తెలిపింది. Also Read: హైదరాబాద్ లో వింత దొంగలు.. ఏం దొరకలేదని టేబుల్ పై రూ.20..! అయితే రాష్ట్ర ప్రభుత్వం మొదటి విడత కౌన్సెలింగ్‌లో 2,600 సీట్లకు పర్మిషన్ ఇచ్చింది. తాజాగా రెండో విడతకు సుమారు 9 వేల సీట్లు మంజూరు చేయనుంది. వీటికి సంబంధించి విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి బుర్రా వెంకటేశం కసరత్తు పూర్తి చేశారు. దాదాపు సగం సీట్లకు కోత పెట్టినట్లేనని కళాశాలల యాజమాన్యాలు చెబుతున్నాయి. ఇక తొలివిడత కౌన్సెలింగ్‌లో మొత్తం 75,200 మందికి బీటెక్ సీట్లు వచ్చాయి. వీళ్లు ట్యూషన్ ఫీజు చెల్లించి ఆన్‌లైన్‌లో సెల్ఫ్ రిపోర్టింగ్ చేసే గడువు ఈ నెల 23వ తేదీతో ముగిసింది. ఈ గడువులో దాదాపు 55 వేలమంది సెల్ఫ్ రిపోర్టింగ్ చేశారు. మిగతా 20 వేల మంది సీట్లు వదులుకున్నారు. అయితే వీళ్లలో చాలామంది మేనేజ్‌మెంట్ కోటాలో చేరే అవకాశం ఉందని తెలుస్తోంది. Also Read: కార్గిల్ యుద్ధంలో ఈ 11 మంది ప్రాణత్యాగం మరిచిపోలేనిది #telugu-news #telangana-news #engineering #b-tech మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి