Animal OTT: యానిమల్ ఓటీటీలో స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్?

సందీప్ వంగా ,రణ్‌బీర్ .. రష్మిక కాంబోలో వచ్చి రికార్డులు కొల్లగుడుతున్న యానిమల్ మూవీ నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అయ్యే డేట్ ఫిక్స్ అయింది.సంక్రాంతి బరిలో దిగనున్న ఈ మూవీ ఓటిటి ప్రియులను అలరించబోతోంది.

New Update
Animal OTT: యానిమల్ ఓటీటీలో స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్?

Animal OTT: అర్జున్ రెడ్డి , కబీర్ సింగ్ , యానిమల్ ఈ మూడు చిత్రాలతో ఇండియన్ బాక్స్ ఆఫీస్ లెక్కలు తిరగరాసిన దర్శకుడు సందీప్ రెడ్డి వంగా యానిమల్ హిట్ జోష లో ఉన్నారు. ఈ మూవీలో రణబీర్ కపూర్ నటనకు ఇండియా వైడ్ గా అల్టిమేట్ అప్లాజ్ వచ్చింది. డిసెంబర్ 1న రిలీజయిన ఈ సినిమా ఇంకా  కలక్షన్ల సునామీ సృష్టిస్తూనే ఉంది. ఇప్పటికి 800 కోట్ల వసూళ్లు రాబట్టి వెయ్యి కోట్లకు చేరువలో ఉంది.

ఓటిటి రైట్స్ నెట్ ఫ్లిక్స్ సొంతం

ఇప్పుడు ఈ యానిమల్ మూవీ ఓటిటి లో స్ట్రీమింగ్ కోసం చాలా అంది వేచి చూస్తున్నారు. ఈ సినిమా ఓటిటి రైట్స్ నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకున్నారని సమాచారం. ఇక.. జనవరి 26 నుంచి డిజిటల్ స్ట్రీమింగ్ కానుందని గతంలో కొన్ని వార్తలు హల్ చల్ చేశాయి. అయితే ఇప్పుడొస్తున్న తాజా సమాచారం ప్రకారం యానిమల్ మూవీ జనవరి 15 తేదీనుంచి ఓటి టి లో స్ట్రీమింగ్ అవుతుందని సమాచారం.

సంక్రాంతి టార్గెట్ గా స్ట్రీమింగ్

ఇప్పటికే సంక్రాంతి బరిలో 5 సినిమాలు రిలీజవుతుండటంతో సినిమాల సందడి మాములుగా ఉండదు. అందరూ ఒకేసారి థియేటర్ కు వెళ్లి సినిమా చూడలేని పరిస్థితి . సో.. ఇలాంటి టార్గెట్ తోనే ఓ టి టి లో సంక్రాంతి కానుకగా రిలీజ్ చేసేందుకు నిరన్యం తీసుకున్నట్లు సమాచారం. అయితే .. ఈ విషయంపై నెట్ ఫ్లిక్స్ ఎలాంటి అధికారిక ప్రకటన వెల్లడించలేదు. కానీ.. ఈ సినిమా మాత్రం ముందుగా అనుకున్న జనవరి 26 తేదీ కంటే ముందుగానే రిలీజ్ కాబోతోంది.

ALSO READ:Mahesh babu vs Teja Sajja: గుంటూరు కారం vs హను-మాన్ . పోటీపై ఆసక్తికర పోస్ట్ పెట్టిన తేజ

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు