Animal : టాలీవుడ్ డైరెక్టర్ సందీప్(Sandeep Reddy Vanga) వంగా ఇటీవల తెరకెక్కించిన సినిమా 'యానిమల్'. రణ్ బీర్(Ranbir Kapoor), రష్మిక(Rashmika), త్రిప్తి డిమ్రి(Tripti Dimri) ప్రధాన పాత్రల్లో వచ్చిన ఈ మూవీ రిలీజ్ అయినప్పటినుంచి పలు విమర్శలు ఎదుర్కొంది. స్త్రీలను కించపరిచారంటూ పలువురు మహిళలు ఆగ్రహం వ్యక్తం చేశారు. అయినప్పటికీ ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు రాబట్టింది. అయితే ప్రస్తుతం ఇది నెట్‌ఫ్లిక్స్(Netflix) లో స్ట్రీమింగ్ అవుతుండగా.. మరికొన్ని సీన్లు కలిపినట్లు తెలుస్తోంది. అయితే సినిమానే చాలా వల్గర్ గా చూపించారని ఆరోపణలు వస్తుంటే.. ఓటీటీ(OTT) లో మరిన్ని సన్నివేశాలు జత చేయడంపై బాలీవుడ్ నటుడు అమీర్ ఖాన్(Ameer Khan) మాజీ భార్య కిరణ్‌రావు తీవ్ర విమర్శలు చేశారు.
వేధింపులను ప్రోత్సహించేలా..
ఈ మేరకు కిరణ్ రావు(Kiran Rao) ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ‘కబీర్‌సింగ్’, ‘యానిమల్’(Animal) చిత్రాలు స్త్రీలపై ద్వేషం, వేధింపులను ప్రోత్సహించేలా ఉన్నాయని మండిపడ్డారు. ఇలాంటి కంటెంట్ మహిళల పట్ల మరింత అగౌరవాన్ని పెంచుతుందన్నారు. అయితే ఆమె వ్యాఖ్యలు సోషల్ మీడియా(Social Media) లో వైరల్ కావడంతో డైరెక్టర్ సందీప్ తనదైన స్టైల్ లో స్పందించారు. 'కిరణ్ రావు కామెంట్స్ నన్ను ఆశ్చర్యపరిచాయి. నేను ఆమెకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నా. మీరు బాలీవుడ్ స్టార్ హీరో అమీర్‌ఖాన్ నటించిన ‘దిల్’ సినిమా చూడండి. అందులో ఒక నటిపై దారుణమైన సన్నివేశాలు చిత్రీకరించారు. తనను అత్యాచారం చేయాలని చూసిన వ్యక్తితోనే ప్రేమలో పడినట్లు చూపారు. ఇలాంటివన్నీ ఏంటి? ముందు వీటి గురించి తెలుసుకోండి. తర్వాత నా సినిమాలను విమర్శించండి’ అంటూ గతాన్ని గుర్తు చేశారు.
ఇది కూడా చదవండి: Mysore: భార్యను 12ఏళ్లు బంధించిన భర్త.. బాక్స్ లో మలమూత్రాలు, కిటికీలోంచి ఫుడ్
మరింత క్రూరంగా ఉంటుంది..
అలాగే త్వరలోనే దీనికి సీక్వెల్ ‘యానిమల్ పార్క్’(Animal Park) రానుండగా సీక్వెల్‌పై మాట్లాడుతూ.. ‘ఇందులో మరిన్ని బలమైన పాత్రలు ఉంటాయి. అలాగే గతంలో వచ్చిన సినిమాల కంటే ఎక్కువ థ్రిల్‌ను పంచడమే ‘యానిమల్ పార్క్’ లక్ష్యం. ఊహించనన్ని యాక్షన్ సన్నివేశాలుంటాయి. రణ్‌బీర్ కపూర్ పాత్ర మరింత క్రూరంగా ఉంటుంది’ అంటూ చెప్పుకొచ్చాడు. ఇక ఈ సెకండ్ హాఫ్.. 2025లో సెట్స్‌పైకి వెళ్లనుండగా ఇప్పటికే దీనికి సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ కూడా మొదలైన్నట్లు సమాచారం.