Parliament:పార్లమెంటులో యానిమల్ రచ్చ..ఇలాంటి సినిమాలు అవసరమా అన్న కాంగ్రెస్ ఎంపీ

రణబీర్ కపూర్ -రష్మిక కాంబినేషన్ లో వచ్చిన యానిమల్ సినిమా సూపర్ హిట్ అయింది. కానీ ఈ సినిమా మీద చాలా ట్రోలింగ్ కూడా నడుస్తోంది. మరోవైపు యానిమల్ సినిమా రాజ్యసభలో కూడా రచ్చ చేసింది. సమాజానికి పట్టు యానిమల్ అని కాంగ్రెస్ ఎంపీ రంజీత్ రంజన్ అన్నారు.

New Update
Parliament:పార్లమెంటులో యానిమల్ రచ్చ..ఇలాంటి సినిమాలు అవసరమా అన్న కాంగ్రెస్ ఎంపీ

యానిమల్...దేశంలో ఇదో పెద్ద టాపిక్ ఇప్పుడు. ఈ పాన్ ఇండియా మూవీ ఇండియా మొత్తం సూపర్ కలెక్షన్స్ సాధిస్తోంది. దర్శకుడు సందీప్ వంగాను అందరూ మెచ్చేసుకుంటున్నారు. రామ్ గోపాల్ వర్మ, అల్లు అర్జున్ లాంటి వాళ్ళు తెగ పొగిడేశారు కూడా. కానీ మరోవైపు యానిమల్ సినిమా మీద రచ్చ కూడా నడుస్తోంది. ఇలాంటి సినిమా సమాజానికి ఏం మెసేజ్ ఇస్తుంది అంటూ సోషల్ మీడియాలో అందరూ తెగ తిట్టిపోస్తున్నారు. కరెక్ట్ గా ఇదే చర్చ నిన్న పార్లమెంటులోని రాజ్యసభలో కూడా నడిచింది. యానిమల్ సినిమా సమాజానికి పట్టిన జబ్బుగా అభివర్ణించారు కాంగ్రెస్ పార్టీ ఎంపీ రంజీత్ రంజన్.

Also Read:నేడు బీఆర్ఎస్‌ఎల్పీ సమావేశం.. శాసనసభా పక్ష నేతగా కేసీఆర్ ఎన్నిక?

యానిమల్ సినిమా చూసి తన కూతురు ఏడ్చిందని చెప్పుకొచ్చారు రంజీత్. ఆ సినిమాలో మహిళలను దారుణంగా చూపించారని...వారిపట్ల కృూరంగా ప్రవర్తించారని విమర్శించారు. సినిమా అనేది సమాజం మీద చాలా ప్రభావం చూపిస్తుంది. ఇలాంటి వాటివల్ల యువత ఏం నేర్చుకుంటుంది అంటూ రంజీత్ రంజన్ ప్రశ్నించారు. నా కూతురు తన ఫ్రెండ్స్ తో కలిసి యానిమల్ కు వెళ్ళింది...కానీ మధ్యలోనే ఏడుస్తూ బయటకు వచ్చిందని చెప్పారు.

దీంతో పాటూ యానిమల్ సినిమాలో సిక్కుల యుద్ధగీతం అర్జన్ వైలీని ఓ హింసాత్మక సీన్ కోసం వాడడాన్ని కూడా రంజీత్ తప్పుబట్టారు. మొఘల్స్, బ్రిటీష్ తో పోరాడిన సిక్కు యోధుల వీరగాధను ప్రపంచానికి తెలిపిన ఈ పాటను ఇలా వాడుకోవడం అస్సలు సహించకూడదని ఆమె అన్నారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు