OTT Release : 'యానిమల్'(Animal) ఫ్యాన్స్ కు అదిరిపోయే గుడ్ న్యూస్ వెలువడింది. సందీప్ వంగా(Sandeep Vanga) దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీ ఇటీవల విడుదలవగా బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు రాబడుతోంది. రణ్ బీర్ కపూర్(Ranbir Kapoor), రష్మిక(Rashmika), త్రిప్తి డిమ్రి(Tripti Dimri)హీరో హీరోయిన్లుగా నటించిన ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ముఖ్యంగా లవ్ స్టోరీ, బోల్డ్ కంటెంట్ యువతరాన్ని అట్రాక్ట్ చేస్తుండగా.. ఇప్పటీకీ థియేటర్లు హౌస్ ఫుల్ బోర్డులు దర్శనమిస్తున్నాయి. అయితే ఈ మూవీకోసం ఓటీటీ(OTT) ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్న విషయం తెలిసిందే. కాగా రీసెంట్ గా దీనిపై క్లారిటీ ఇచ్చారు డైరెక్టర్ సందీప్ వంగా.
ఈ మేరకు సూపర్‌హిట్ మూవీ ‘యానిమల్’ ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్(Netflix) వేదికగా ఇది స్ట్రీమింగ్ కానుందని స్పష్టం చేశారు. ‘యానిమల్’ రన్‌టైమ్ మూడున్నర గంటలు. కానీ ఒత్తిడి కారణంగా సుమారు తొమ్మిది నిమిషాల సన్నివేశాలను కట్ చేశాం. ప్రస్తుతం నేను నెట్‌ఫ్లిక్స్ వెర్షన్ కోసం ఎడిటింగ్ చేస్తున్నా. థియేటర్ కోసం తొలగించిన షాట్స్‌ను ఓటీటీ వెర్షన్‌కు యాడ్ చేస్తున్నా’ అంటూ ఆసక్తికర విషయాలు వెల్లడించారు. ప్రస్తుతం ఈ న్యూస్ వైరల్ అవుతుండగా ఫ్యాన్స్ ఫుల్ ఖుష్ అవుతున్నారు. ఇప్పటికే సినిమా ఓ రేంజ్ లో ఉందని, కట్ చేసిన సీన్స్ ఇంకెలా ఉన్నాయో అంటూ సినిమాపై మరోసారి అంచనాలు పెంచేస్తున్నారు.
ఇది కూడా చదవండి : నారా ఫ్యామిలీకి క్రిస్మస్ గ్రీటింగ్స్ పంపిన వైఎస్ షర్మిల.. లోకేష్ రిప్లై వైరల్
ఇక నెట్‌ఫ్లిక్స్ ప్లాట్‍ఫామ్‍లోకి జనవరి మూడు లేదా నాలుగో వారంలో స్ట్రీమింగ్‍కు వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. థియేటర్లలో భారీ కలెక్షన్లతో సత్తాచాటిన యానిమల్‍కు ఓటీటీలోనూ మంచి స్పందన వస్తుందని అంచనా వేస్తున్నారు. ఇదిలావుంటే.. డిసెంబర్ 1న థియేటర్లలో రిలీజ్ అయిన ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా సుమారు రూ.840 కోట్లను కలెక్ట్ చేసింది. బాబీ డియోల్ విలన్ పాత్ర పోషించగా రణ్‍బీర్ తండ్రి పాత్రలో అనిల్ కపూర్ కనిపించారు. తృప్తి డిమ్రి ఈ చిత్రానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. భూషణ్ కుమార్, మురాద్ ఖేతానీ, కృషన్ కుమార్, ప్రణయ్ రెడ్డి వంగా నిర్మించారు. ఏడుగురు మ్యూజిక్ డైరెక్టర్లు పనిచేయడం విశేషం.