Pawan Vs Ambati: పవన్ సీఎం కావాలంటే గోవా వెళ్లాల్సిందే.. అంబటి రాంబాబు సెటైర్లు!

జగన్ ప్రతిపక్ష హోదా కావాలంటే జర్మనీ వెళ్లాలంటూ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలకు అంబటి రాంబాబు కౌంటర్ ఇచ్చారు. పవన్ కల్యాణ్ సీఎం కావాలంటే గోవా వెళ్లాలంటూ సెటైర్లు వేశారు. ఈ మేరకు తన X ఖాతాలో పోస్టు చేశారు అంబటి.

New Update
Ambati Rambabu Pawan Kalyan

Ambati Rambabu Pawan Kalyan

పవన్ కళ్యాణ్ సీఎం కావాలంటే గోవా వెళ్లాల్సిందేనని మాజీ మంత్రి, వైసీపీ నేత సెటైర్లు విసిరారు. జగన్ కు ప్రతిపక్ష హోదా కావాలంటే జర్మనీ వెళ్లాలంటూ పవన్ చేసిన వ్యాఖ్యలకు ఆయన కౌంటర్ ఇచ్చారు. ఈ మేరకు తన X ఖాతాలో పోస్ట్ చేశారు. ఈ రోజు వైసీపీ శాసనసభ్యులు, జగన్ అసెంబ్లీకి హాజరయ్యారు. వైసీపీకి ప్రతిపక్ష హోదా ఇవ్వాలంటూ ఆందోళన చేస్తూ గవర్నర్ ప్రసంగాన్ని అడ్డుకున్నారు. అనంతరం వాకౌట్ చేసి వెళ్లిపోయారు. ఈ అంశంపై పవన్ కల్యాణ్ స్పందించారు.

ప్రజలే ప్రతిపక్ష హోదా ఇవ్వలేదు..

అసెంబ్లీ ఆవరణలో మీడియాతో మాట్లాడారు. వైసీపీకి ప్రతిపక్ష హోదా తానో లేదా సీఎం చంద్రబాబో ఇచ్చేది కాదన్నారు. ప్రజలే ఆ పార్టీకి ప్రతిపక్ష హోదా ఇవ్వలేదన్నారు. ఎక్కువ ఓట్ల శాతం వచ్చిన పార్టీకి ఎక్కువ సేపు మాట్లాడే ఛాన్స్ జర్మనీలోనే ఉంటుందన్నారు. ఆ అవకాశం కావాలంటే జగన్ ఆ దేశానికి వెళ్లాల్సి ఉంటుందన్నారు. గోవాలో అసెంబ్లీ స్థానాలు కేవలం 40 మాత్రమే ఉంటాయి. అక్కడ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి మేజిక్ ఫిగర్ 21. గత ఎన్నికల సమయంలో జనసేనకు కూడా 21 సీట్లు వచ్చాయి. ఈ నేపథ్యంలోనే అంబటి రాంబాబు ఈ ట్వీట్ చేసినట్లు తెలుస్తోంది. 

 

Advertisment
Advertisment
తాజా కథనాలు