/rtv/media/media_files/2024/10/25/7Bod6P6nQLilWLFmMxE3.jpeg)
వైసీపీ అధినేత వైఎస్ జగన్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఏపీ అసెంబ్లీ సమావేశాలు 10 రోజుల పాటు నిర్వహించాలని స్పీకర్ అయ్యన్నపాత్రుడి అధ్యక్షతన జరిగిన బీఏసీ సమావేశంలో గురువారం నిర్ణయించారు. సెప్టెంబర్ 18 నుంచి ఆంధ్రప్రదేశ్ శాసనసభ సమావేశాలు ప్రారంభమైన విషయం తెలిసిందే. జగన్ ఈసారి అసెంబ్లీ సమావేశాలకు రావాలనుకుంటున్నట్లు తెలిపారు. వైసీపీ శాసనససభా పక్ష భేటీలో వైసీపీ అధినేత జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రతిపక్ష హోదా ఇవ్వకపోయినా.. అసెంబ్లీకి రావడానికి సిద్ధంగా ఉన్నట్లు ఆయన ఎమ్మెల్యేలతో చెప్పారు. కానీ ఆయన అసెంబ్లీకి రావాలంటే ఓ కండిషన్ పెట్టారు. సభలో తగినంత టైమ్ ఇస్తే రేపటి నుంచే సభకు వస్తానని చెప్పారు.
ఎమ్మెల్యేలకు ఇచ్చినట్లు కొన్ని నిమిషాలు ఇస్తే తాను ఏం మాట్లాడాలని వైఎస్ జగన్ అన్నారు. ప్రజా సమస్యలు వివరంగా చెప్పాలంటే టైమ్ ఇవ్వాలని ఆయన కూటమి ప్రభుత్వాన్ని అడిగారు. వైసీపీ ఎమ్మెల్యేలను స్పీకర్ దగ్గరకి వెళ్లి ఈ విషయాన్ని చెప్పమని అన్నారు.
సెప్టెంబర్ 30 వరకు అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. 20, 21, 28 తేదీల్లో సెలవు ఉండనుంది. రోజూ ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు సభ జరపాలని నిర్ణయించారు. సభలో చర్చించేందుకు 18 అంశాలను తెదేపా, 9 అంశాలను భాజపా ప్రతిపాదించింది. ప్రశ్నోత్తరాలతో పాటు జీరో అవర్‌లోనూ మంత్రులు ఉండాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు.
వీటితో పాటు "ఆడుదాం ఆంధ్ర" కార్యక్రమంలో జరిగిన అవకతవకలు, 22-ఏ కింద ఉన్న భూముల సమస్యలు, ఈనాం, అసైన్డ్ భూముల వివాదాలు, గృహ నిర్మాణం, పరిశ్రమల స్థాపన-ఉద్యోగాల కల్పన, రబీ ధాన్యం సేకరణ, పెండింగ్ బిల్లుల చెల్లింపు వంటి సుమారు 22 అంశాలపై ఈ సమావేశాల్లో వాడీవేడి చర్చ జరిగే అవకాశం ఉంది.