BREAKING: విజయమ్మ మరో సంచలన లేఖ!

వైఎస్ విజయమ్మ మరో లేఖ విడుదల చేశారు. ఎప్పుడో జరిగిన తన కారు ప్రమాదాన్ని ఇప్పుడు జరిగినట్లుగా చిత్రీకరిస్తున్నారన్నారు. ఈ ప్రమాదానికి తన కుమారుడు కారణమన్నట్లుగా దుష్ఫ్రచారం చేస్తున్నారన్నారు. ఇలాంటి అసత్య ప్రచారాలు చేస్తే ఇక మీదట ఊరుకోనన్నారు.

YS Vijayamma Letter to jagan
New Update

వైఎస్ విజయమ్మ సంచలన లేఖ రాశారు. తన కారుకు ప్రమాదంపై దుష్ఫ్రచారం చేస్తున్నారని ఫైర్ అయ్యారు.  గతంలో విజయమ్మ కారుకు ప్రమాదం జరిగింది. ఇది జగన్ కుట్రే అన్నట్లుగా ఇటీవల సోషల్ మీడియాలో కొన్ని పోస్టులు వైరల్ అవుతున్నాయి. ఈ నేపథ్యంలో విజయమ్మ స్పందించారు. ఎప్పుడో జరిగిన తన కారు ప్రమాదాన్ని ఇప్పుడు జరిగినట్లుగా ప్రచారం చేస్తున్నారని విజయమ్మ ఆవేదన వ్యక్తం చేశారు. ఇది తన కుమారుడు జగన్ చేయించినట్లు దుష్ప్రచారం చేస్తున్నారని ఫైర్ అయ్యారు.
ఇది కూడా చదవండి: హోంమంత్రి అనితపై పవన్ సీరియస్.. ఇక ఊరుకోనంటూ..

తనను అడ్డుపెట్టుకుని నీచ, నికృష్ణ రాజకీయాలు చేస్తున్నారన్నారు. రాజకీయ ప్రయోజనం కోసం ఇంతగా దిగజారి ప్రయత్నించడం ప్రజాస్వామ్యానికి మంచిది కాదన్నారు. ఈ వికృత చేష్టలను ప్రజలు గమనిస్తూనే ఉన్నారన్నారు. ఇకపై ఇలాంటి అసత్య ప్రచారం చేస్తూ చూస్తూ ఊరుకోనని హెచ్చరించారు. అమెరికాలో ఉన్న తన మనవడి దగ్గరకు వెళితే దాన్ని కూడా తప్పుగా చిత్రీకరిస్తున్నారన్నారు. భయపడి తాను విదేశాలకు వెళ్ళిపోయినట్లు దుష్ప్రచారం చెయ్యడం అత్యంత నీతిమాలిన చర్య అని అన్నారు.
ఇది కూడా చదవండి: YCP-Jagan: జగన్‌కు దెబ్బ మీద దెబ్బ.. ఆ ఇద్దరు కీలక నేతలు జంప్!

ఇటీవల ఆస్తుల వివాదంపై లేఖ..

జగన్, షర్మిల ఆస్తుల వివాదంపై ఇటీవల విజయమ్మ లేఖ రాశారు. తన కుటుంబానికి ఏ దిష్టి తగిలిందో నాకు అర్థం కావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. అన్న, చెల్లి ఇద్దరు అంగీకారానికి వస్తారు, వాళ్లను రెచ్చగొట్టొద్దని సూచించారు. ఈ విషయంలో వైవీ సుబ్బారెడ్డి, విజయసాయి పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నారని ఆరోపించారు. అమ్మగా తనకు ఇద్దరు సమానమేనన్నారు. ఆస్తుల్లో భాగం కూడా ఇద్దరికి సమానమేనన్నారు. నలుగురు మనవళ్లు, మనవరాళ్లకు ఆస్తి సమానంగా ఉండాలనేది వైఎస్ కోరిక అని స్పష్టం చేశారు. ఆస్తులను పెంచడంలో జగన్ కష్టం ఉందన్నారు. కానీ అవన్ని కుటుంబ ఆస్తులేనన్నారు. ఒక బిడ్డ ఇంకో బిడ్డకు అన్యాయం చేస్తుంటే తట్టుకోలేనని ఆవేదన వ్యక్తం చేశారు. జగన్‌ కోసం షర్మిల ఎంతగానో చేసిందన్నారు.

#jagan #sharmila #ys vijayamma
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe