YS Sharmila: విజయసాయి రాజకీయ సన్యాసం వెనుక సీక్రెట్ ఇదే.. సంచలన సీక్రెట్స్ చెప్పిన షర్మిల!

జగన్ బీజేపీకి దత్త పుత్రుడని షర్మిల ఆరోపించారు. తనను తాను కాపాడుకోవడానికే సాయిరెడ్డిని BJPకి పంపించాడని ఆరోపించారు. ఇన్నాళ్లు సాయి రెడ్డిని పక్కన పెట్టుకొని బీజేపీకి అనుకూలంగా ఉన్నాడన్నారు. జగన్ విశ్వసనీయత కోల్పోయాడు కాబట్టే సాయి రెడ్డి వెళ్ళిపోయాడన్నారు.

New Update

తాను రాజకీయాలకు దూరం అవుతున్నట్లు ప్రకటించడంపై వైఎస్ షర్మిల స్పందించారు. ఈ రోజు ఆమె మాట్లాడుతూ.. జగన్ ఏ పని ఆదేశిస్తే ఆ పని చేయడం, ఎవరిని తిట్టమంటే వాళ్ళను తిట్టడం సాయి రెడ్డి పని అని ఆరోపించారు. రాజకీయంగా కాదు వ్యక్తిగతంగా కూడా తన బిడ్డల విషయంలో అబద్ధాలు చెప్పిన వ్యక్తి సాయిరెడ్డి అని సంచలన వ్యాఖ్యలు చేశారు. జగన్ చెబితేనే సాయిరెడ్డి అబద్ధాలు చెప్పాడన్నారు. ఇలాంటి జగన్ సన్నిహితుడు ఇప్పుడు రాజీనామా చేశాడంటే చిన్న విషయం కాదన్నారు. వైసీపీ కార్యకర్తలు, వైఎస్ అభిమానులు ఆలోచన చేయాలన్నారు. జగన్ ను విజయసాయి రెడ్డి ఎందుకు వదిలేశారు? ఒక్కొక్కరుగా ఎందుకు వెళ్తున్నారు? ప్రాణం పెట్టిన వాళ్ళు ఎందుకు జగన్ ను వీడుతున్నారు? అన్న విషయాలను వైసీపీ శ్రేణులు ఆలోచించాలన్నారు.
ఇది కూడా చదవండి: Chandrababu: విజయసాయిరెడ్డి రాజీనామా.. జగన్ పై చంద్రబాబు సెటైర్లు-VIDEO

జగనే పంపాడు..

నాయకుడుగా ప్రజలను, నమ్ముకున్న వాళ్ళను జగన్ మోసం చేశారని ఆరోపించారు. నా అనుకున్న వాళ్ళను కాపాడుకోలేక పోతున్నాడన్నారు. జగన్ బీజేపీకి దత్త పుత్రుడని ఆరోపించారు. తనను తాను కాపాడుకోవడానికే సాయిరెడ్డిని బీజేపీకి పంపించాడని ఆరోపించారు. ఇన్నాళ్లు సాయి రెడ్డిని పక్కన పెట్టుకొని బీజేపీకి అనుకూలంగా ఉన్నాడన్నారు. జగన్ విశ్వసనీయత కోల్పోయాడు కాబట్టే సాయి రెడ్డి వెళ్ళిపోయాడన్నారు. సాయిరెడ్డి ఇప్పటికైనా నిజాలు చెప్పాలని డిమాండ్ చేశారు షర్మిల. వివేకా హత్య విషయంలో నిజం చెప్పినందుకు సంతోషమన్నారు. మిగతా విషయాలు కూడా బయట పెట్టాలన్నారు. 
ఇది కూడా చదవండి: AP Politics: లోక్ సభ, రాజ్యసభల్లో వైసీపీ ఖతం.. బీజేపీ సంచలన వ్యూహం!

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు