Viral News: అసలు ఈ దేవిక ఎవరు? సోషల్ మీడియాలో TDP, YCP ఫ్యాన్స్ రచ్చ రచ్చ!

వైఎస్ జగన్ విజయవాడ పర్యటనలో చిన్నారి దేవికతో దిగిన ఫొటోలు, ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇదంతా ఓ డ్రామా అంటూ టీడీపీ ఫ్యాన్స్ పోస్టులు పెడుతుండగా.. చిన్న పిల్లలను పాలిటిక్స్ కు బలి చేయొద్దంటూ YCP అభిమానులు కౌంటర్ ఇస్తున్నారు.

New Update
YS JAGAN AND CHINNARI DEVIKA VIDEO TROLLS

YS JAGAN AND CHINNARI DEVIKA VIDEO TROLLS

Viral News: చిన్నారి దేవిక.. ఈ పేరు ఇప్పుడు మారుమోగిపోతోంది. ఇన్‌స్టాగ్రామ్, ట్విట్టర్, ఫేస్‌బుక్ ఇలా ఏ సోషల్ మీడియా ప్లాట్ ఫార్మ్ ఓపెన్ చేసిన ఈ చిన్నారి పేరే వినిపిస్తోంది. అందుకు కారణం ఆ చిన్నారి వైఎస్ జగన్‌ను చూడాలంటూ ఏడుస్తూ మరీ ఫొటో దిగడం.. ఆ ఫొటో, వీడియోలు వైరల్ కావడం.

వైసీపీ అధినేత, ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ ఇటీవల వల్లభనేని వంశీ(Vallabhaneni Vamsi)ని పరామర్శించేందుకు విజయవాడలోని జిల్లా కారాగారానికి వచ్చారు. దీంతో జగన్ ను చూడడానికి వైసీపీ అభిమానులు అక్కడికి భారీగా చేరుకున్నారు. అందులో దేవిక అనే పాప కూడా అక్కడికి వచ్చింది. జగన్ తో ఫొటో దిగడానికి పట్టుబట్టింది దీంతో జగన్ బయటకు వచ్చి ఆమెను ముద్దాడారు. అనంతరం ఆ చిన్నారి జగన్‌తో సెల్ఫీ తీసుకుంది.  

Also Read: City Killer Asteroid:దూసుకొస్తున్న "సిటీ కిల్లర్".. దేశంలో ఆ రెండు నగరాలు ఇక కనిపించే అవకాశం లేదా!

దేవికపై ట్రోలింగ్స్

ఇప్పుడు అందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో ట్రెండింగ్‌గా మారాయి. దీంతో ఆమెపై ట్రోలింగ్ మొదలైంది. ఒక్కోక్కరు ఒక్కో విధంగా ట్రోలింగ్ చేయడం మొదలు పెట్టారు. 

అందులో ఒకరు ట్వీట్ చేస్తూ.. ‘‘సొంత నిర్ణయాలు తీసుకోడు.. ఐ ప్యాక్ ఏమి చెప్తే అది చేస్తాడు’’ అంటూ ట్వీట్‌లో రాసుకొచ్చారు. 

Also Read: USA: అబ్బా మళ్ళీ కొట్టాడు..ఔషధాలపై 25శాతం సుంకం ప్రకటన..కుప్పకూలిన ఫార్మా స్టాక్స్

ఇంకొరేమో ‘‘సొంత మేన అల్లుడి & మేన కోడల్ని మోసం చేసినోడు.. ఊళ్ళో ఉన్నోళ్లకి మేన మామ.. వాళ్ళ వయసు ఏంటి చేయుస్తున్న పనులేంటి’’ అంటూ ట్వీట్ చేశారు.

Also Read: America: పనామా హోటల్‌ లో 300 మంది భారతీయులు సాయం కోసం కేకలు!

 అలాగే స్వంత చెల్లిని, బాబాయి కూతురుని పేటిఎం బ్యాచ్‌తో బూతులు తిట్టించే ఈ మహానుభావుడు.. జనాల పిల్లల్ని మాత్రం ప్రేమగా చూస్తాడని నమ్మే వెర్రి గొర్రెలు ఆంధ్రాలో లేరని ఇంకా తెలియదా.. ఐ ప్యాక్ డ్రామాలు ఆపండ్రా.. చిరాకేస్థుంది అంటున్నారు. ఈ మేరకు కావాలనే వైసీపీ వాళ్లు ఈ డ్రామా చేయించారంటున్నారు. అక్కడి దిగిన ఫోటోలకు సంబంధించి కెమెరా యాంగిల్స్‌ను సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. 

మరోవైపు ఆ చిన్నారి తల్లినే మార్చేసి.. వేరొకరితో పోల్చుతున్నారు. దీంతో రాజకీయాల కోసం ఆ చిన్నారి తల్లినే మార్చేసిన సోషల్ మీడియా సైకోలు అంటూ ఇంకొందరు విరుచుకు పడుతున్నారు. 

అలాగే మరొకరు ‘‘ఈ అభిమానం ఐప్యాక్ సొంతం, అసలు ఐప్యాక్ లేకపోతే మీకు ఇలాంటి వీడియోలు ఎక్కడ నుంచి వస్తాయ్..! మీ పేటీఎం బ్యాచ్‌కి దండాలు పెట్టాల్సింది’’ అంటూ అందుకు సంబంధించిన వీడియోలు షేర్ చేస్తున్నారు. 

‘‘ఐ ప్యాక్ టీం రంగంలోకి దిగింది అనుకుంటా ఇంకా ఇలాంటివి ఎన్నో వస్తాయో. కానీ ప్రతీ సారి జనాలను మోసం చేయలేవు జగన్’’ అంటూ మరొకరు ట్వీట్ చేశారు.

ఇలా టీడీపీ ఫ్యాన్స్ విమర్శలు చేస్తుంటే.. వైసీపీ ఫ్యాన్స్ మాత్రం ఇలాంటి అభిమానం, ప్రేమ వైఎస్ జగన్‌కు మాత్రమే సొంతం అంటూ మరోవైపు వీడియోలు విసృతంగా షేర్ చేస్తున్నారు. 

ఇక ఆ చిన్నారి దేవిక అలాగే ఆమె ఫ్యామిలీపై కొందరు తీవ్రంగా విమర్శిస్తున్నారు. దేవిక తండ్రి ఓ షాప్‌లో పాట్నర్ అని ట్రోల్స్ చేస్తున్నారు. కానీ వాస్తవంగా ఆ చిన్నారి తండ్రి ఒక షాప్‌లో నెలవారీ జీతానికి పనిచేస్తున్నారని తెలిసింది. అలాగే వీరికి ఒక అపార్ట్‌మెంట్ ఉందని అంటున్నారు. కానీ వారు ఉండేది ఒక అపార్ట్‌మెంట్‌లోని అద్దెకు అని తెలుస్తోంది. ఇక ఆ చిన్నారి ఢిల్లీ పబ్లిక్ స్కూల్‌లో చదువుతున్నట్లు ప్రచారం చేస్తున్నారు. అయితే వాస్తవం ప్రకారం.. దేవికా రవీంద్ర భారతిలో చదువుతున్నట్లు తెలిసింది. ఇక ఆ పాపపై ఎందుకు ఇన్ని ట్రోలింగ్స్ చేస్తున్నారని కొందరు ప్రశ్నిస్తున్నారు. 

ఈ చిన్నారి విషయంలో టీడీపీ, వైసీపీ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో పోస్టుల యుద్ధం చేస్తున్నారు. ఎవరి వాదన వారు వినిపిస్తున్నారు. దీంతో ఎవరి వాదన కరక్టో తెలియక నెటిజన్లు జుట్టు పీక్కుంటున్నారు.

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు