Roja : నా కొడుక్కి న్యూడ్ ఫోటోలు పంపుతున్నారు.. లైవ్లో ఏడ్చేసిన రోజా!

ఓ టీవీ ఛానల్ కు ఇచ్చిన డిబేట్ లో ఆమె మాట్లాడుతూ కన్నీళ్లు పెట్టుకున్నారు. పెయిడ్ అర్టిస్ట్ లను పెట్టుకుని తనను అవమానిస్తున్నారని..  దిగజారి మరి రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు.

New Update
roja-son

నగరి నియోజకవర్గంలో మాజీ మంత్రి రోజా, నగరి ఎమ్మెల్యే గాలి భానుప్రకాష్ మధ్య వార్ నడుస్తోంది. ఇసుక, బియ్యం స్మగ్లింగ్‌తో రోజాతో పాటు ఆమె సోదరులకు, భర్తకు సంబంధం లేదని కాణిపాకం గుడికి వచ్చి ప్రమాణం చేయాలని ఎమ్మెల్యే గాలి భానుప్రకాష్ సవాల్‌ విసిరారు.రూ.12 వేల అద్దె ఇంటినుంచి ఇప్పుడు ఊరికో ఇంటిని నిర్మించుకునే స్థాయికి రోజా ఎదిగిందని ఆరోపించారు. అంతేకాకుండా నగరి ఎమ్మెల్యే గాలి భానుప్రకాష్, ఆయన సహచరులు సోషల్‌ మీడియాలో తన గురించి ‘‘రూ.2,000 ఇస్తే ఏ పనైనా చేసేది. మార్కెట్లో ఆ మాట ఉంది. ఆమె నేడు రూ.రెండు వేల కోట్లు సంపాదించింది. ఆమె వ్యాంప్‌కు ఎక్కువ.. హీరోయిన్‌కు తక్కువ. ఈ పిచ్చి దాంతో వాళ్ల పార్టీ నేతకు పిచ్చెక్కిందా.. ఆయన పిచ్చి ఈమెకెక్కిందా తెలియడం లేదు’’ అని దుష్ప్రచారం చేస్తున్నారంటూ రోజా వాపోయింది. 

కన్నీళ్లు పెట్టుకున్న రోజా

ఓ టీవీ ఛానల్ కు ఇచ్చిన డిబేట్ లో ఆమె మాట్లాడుతూ కన్నీళ్లు పెట్టుకున్నారు. పెయిడ్ అర్టిస్ట్ లను పెట్టుకుని తనను అవమానిస్తున్నారని..  దిగజారి మరి రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ లు వెనుకుండి ఇదంతా జరిపిస్తున్నారని రోజా ఆరోపించారు. తనకు జోలికి వచ్చిన వారు ఎవరు కూడా బాగుపడలేదన్నారు రోజా.  తన పిల్లల్ని కూడా వదల్లేదన్నారు. తన పిల్లలకు కూడా న్యూడ్ ఫోటోలు పంపుతున్నారని రోజా వాపోయారు.  ఇక్కడ టార్చర్ భరించలేక తన కూతురు ఫారిన్ వెళ్లిపోయిందన్నారు రోజా.  పిల్లల బర్త్ డే పుట్టిన రోజు వేడుకలు చేస్తే కూడా సోషల్ మీడియాలో కూడా కింద కామెంట్స్ చూస్తే అన్ని బూతులేనన్నారు. తాను పట్టుదల గల మనిషినే కాబట్టే రాజకీయాల్లో ఉన్నానని తెలిపారు. 

Advertisment
Advertisment
తాజా కథనాలు