YSRCP : ఈరోజు విజయనగరం జిల్లా గుర్లలో మాజీ సీఎం, వైఎస్సార్‌సీపీ అధినేత జగన్ పర్యటించనున్నారు. డయేరియా సోకి మృతి చెందిన కుటుంబాలను, బాధితులను పరామర్శించనున్నారు. ఉదయం 9 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి 11 గంటల ప్రాంతంలో గుర్ల చేరుకుంటారు. అక్కడ డయేరియా సోకి మృతి చెందిన కుటుంబాలను, చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శిస్తారు. కాగా నిన్న గుంటూరు జిల్లాలో సహన కుటుంబ సభ్యులను పరామర్శించి.. వారికి జగన్ భరోసా కల్పించిన సంగతి తెలిసిందే. అలాగే బద్వేలులో దస్తగిరమ్మ చిత్రపటానికి నివాళులర్పించి, కుటుంబ సభ్యులను పరామర్శించారు జగన్.
Also Read : ఈడీ కార్యాలయంలో ముగిసిన సీనియర్ ఐఏఎస్ అమోయి కుమార్ విచారణ
Also Read : అందుకే షర్మిలపై జగన్ పిటిషన్... YCP సంచలన ట్వీట్!
బాబు హయాంలో అత్యాచారాలు...
ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు జగన్. ఏపీలో దారుణమైన పరిస్థితులు ఉన్నాయని అన్నారు మాజీ సీఎం జగన్. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ లేదని.. శాంతిభద్రతలు ఎలా దిగజారాయో ఈ ఘటన చూస్తే తెలుస్తోందని చెప్పారు. వైసీపీ అధికారంలోకి ఉండగా అక్క చెల్లెమ్మలకు భరోసా ఉండేదని అన్నారు. దిశ యాప్ ద్వారా ఆపదలో ఉన్న మహిళలకు అండగా నిలిచాం అని చెప్పారు. పోలీసులు రెడ్ బుక్ పాలనలో నిమగ్నమయ్యారని అన్నారు జగన్. చంద్రబాబు అధికారంలోకి వచ్చిన 4 నెలల పాలనలో 77 మంది మహిళలు, పిల్లలపై అఘాయిత్యాలు జరిగాయని చెప్పారు. ఏడుగురు హత్య, ఐదుగురు ఆత్మహత్య చేసుకున్నారని అన్నారు. రెడ్ బుక్ పాలనలో టీడీపీ నేతల తప్పులకు శిక్ష ఉండదని చెప్పారు. గతంలో దిశ యాప్ తో 10 నిమిషాల్లో సాయం అందేది అని అన్నారు. దిశ యాప్ ద్వారా 31,607 మంది మహిళలను కాపాడినట్లు చెప్పారు. 18 దిశ పీఎస్ లు, 13 పోక్సో కోర్టులు ఏర్పాటు చేశామన్నారు.
Also Read : భర్తను అలా పిలవడం క్రూరత్వం.. కోర్టు కీలక తీర్పు!
Also Read : ఓవర్లు, 344 పరుగులు.. బాబోయ్ ఇదేం స్కోరు...ఇలా కూడా ఆడతారా..