Hyd:ఈడీ కార్యాలయంలో ముగిసిన సీనియర్ ఐఏఎస్ అమోయి కుమార్ విచారణ

ఈడీ కార్యాలయంలో ముగిసిన సీనియర్ ఐఏఎస్ అమోయి కుమార్ విచారణ కొద్దిసేపటి క్రితం ముగిసింది. ఏడు గంటల పాటు అమోయి కుమర్ ని  ఈడి విచారించింది. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం నాగారంలో భూదాన్ భూముల బదిలీపై విచారణ సాగింది. 

New Update
ias

Senior IAS Amoy Kumar: 

రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం నాగారంలో భూదాన్ భూముల బదిలీపై.. వందల కోట్ల విలువైన 42 ఎకరాలు అక్రమంగా భూమిని ప్రైవేట్ వ్యక్తులకు బదిలీ చేశారని ఆరోపణల నేపథ్యంలో ఈడీ సీనియర్ ఐఏఎస్ అమోయ్ కుమార్‌‌ను ప్రశ్నించింది. అబ్దుల్లాపూర్మెట్ లో సర్వేనెంబర్ 17 లో  పూర్వీకుల నుండి కొంత మంది రైతులకు సంక్రమించిన 26 ఎకరాల సాగుభూములు బలవంతంగా లాక్కున్నారని అమోయ్ కుమార్ ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. దీని కోసం కోట్లలో ముడుపులు తీసుకున్నారని చెబుతున్నారు. నిజాన్ని నిగ్గు తేల్చేందుకు ఈడీ విచారణ చేసింది. అమోయ్ కుమార్ స్టేట్మెంట్ ను ఈడీ రికార్డ్ చేసింది. 

Also Read: HYD: ఇక చెట్ల పరిరక్షణ ధ్యేయం‌‌–హైడ్రా రంగనాథ్

Advertisment
తాజా కథనాలు