Pawan vs Volunteers: పవన్‌పై మండిపడుతున్న మహిళా వాలంటీర్లు.. జనసేన అధినేతలకు మహిళా కమిషన్ నోటీసులు
ఏపీలో మహిళల అదృశ్యాలకు వాలంటీర్లే కారణమని జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలు ఆయన్ను చిక్కుల్లో పడేశాయి. తాజాగా ఏపీ మహిళా కమిషన్ పవన్‌కి నోటీసులు జారీ చేసింది. ఏలూరులో మహిళల మిస్సింగ్‌పై పవన్ చేసిన ఆరోపణలపై ఆధారాలివ్వాలని కోరింది.. 10 రోజులలో సమాధానం ఇవ్వాలని నోటీస్‌లో పేర్కొంది.