పి.గన్నవరంలో చంద్రబాబు, పవన్ రోడ్ షో-LIVE
పి.గన్నవరంలో టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. రానున్న ఎన్నికల్లో ఏపీలో ఎన్డీఏ కూటమిని గెలిపించాలని పిలుపునిచ్చారు. వారి రోడ్ షో లైవ్ చూడండి.
పి.గన్నవరంలో టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. రానున్న ఎన్నికల్లో ఏపీలో ఎన్డీఏ కూటమిని గెలిపించాలని పిలుపునిచ్చారు. వారి రోడ్ షో లైవ్ చూడండి.
నిమ్మగడ్డ రమేష్ ను అడ్డం పెట్టుకుని చంద్రబాబు మరోసారి కుట్ర రాజకీయాలకు తెరలేపారన్నారు ఏలురూ వైసీపీ ఎంపీ అభ్యర్థి కారుమూరి సునీల్. చంద్రబాబు, పవన్, పురంధేశ్వరిలు వాలంటీర్ వ్యవస్థపై అక్కసు వెళ్లగక్కుతూనే ఉన్నారన్నారు. మళ్లీ అధికారం వైసీపీదేనని ధీమా వ్యక్తం చేశారు.
ఉండి నియోజకవర్గ టీడీపీలో అసమ్మతి పోరు ఏ మాత్రం తగ్గడం లేదు. చిన అమిరం టీడీపీ ఆఫీసు ముందు కార్యకర్తల ఆందోళన చేపట్టారు. రామరాజుకే టికెట్ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. వీ వాంట్ జస్టిస్ అంటూ నినాదాలు చేస్తున్నారు. జిల్లా అధ్యక్షురాలు సీతారామలక్ష్మి ఇంటిని ముట్టడించారు.
నరసాపురం టీడీపీలో అసంతృప్తి సెగలు కనిపిస్తున్నాయి. గతంలో టీడీపీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన మాధవ నాయుడు ఇప్పుడు రెబల్‌గా పోటీ చేసేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. నరసాపురం అసెంబ్లీ సీటుని జనసేనకు ఇవ్వడంతో ఈ నిర్ణయం తీసుకున్నారని సమాచారం.
పశ్చిమ గోదావరి తణుకు ప్రజాగళం సభలో విడివాడ రామచంద్రరావు అనుచరులు ఆందోళన చేపట్టారు. నియోజకవర్గ జనసేన ఇంఛార్జ్ విడివాడ రామచంద్రరావుకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని ప్లకార్డులు ప్రదర్శించారు. గెలిచే సీటును ఎందుకూ టీడీపీకి కట్టబెట్టారని నిరసన చేశారు.
ఉండి అసెంబ్లీ నియోజకవర్గంలో టీడీపీకి భారీ షాక్ తగిలింది. 400 మంది టీడీపీ నాయకులు తమ రాజీనామా పత్రాలను రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడుకి పంపారు. సీటు అధికారికంగా రఘురామ కృష్ణంరాజుకు అనౌన్స్ అయితే పరిణామాలు వేరేగా ఉంటాయంటూ రామరాజు వర్గీయులు హెచ్చరిస్తున్నారు.
ఉండి టీడీపీలో అసమ్మతి చెలరేగిపోతుంది. నరసాపురం ఎంపీ రఘురామ రాజుకు టికెట్ ఇస్తారన్న ప్రచారంతో ఎమ్మెల్యే రామరాజు భావోద్వేగానికి గురై కంటతడి పెట్టుకున్నారు. కార్యకర్తలతో సమావేశమై టికెట్ వేరేవారికి ఇవ్వబోతున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు.
అభ్యర్థుల మొదటి జాబితాను విడుదల చేసింది భారత చైతన్య యువజన పార్టీ. 32 నియోజకవర్గాల్లో అభ్యర్థులను ప్రకటించారు ఆ పార్టీ అధినేత రామచంద్ర యాదవ్. ఈ క్రమంలో పవన్ పోటీ చేస్తున్న పిఠాపురం నుంచి బిగ్ బాస్ ఫేమ్ ట్రాన్స్‌జెండర్ తమన్నా సింహాద్రిని పోటీలోకి దింపారు.
జనసేనకు మరో బిగ్ షాక్ తగిలింది. కైకలూరు నియోజకవర్గం జనసేన పార్టీ సమన్వయకర్త బీవీ రావు రాజీనామా చేశారు. ఆయనతో పాటు తన సహచరులు సైతం పార్టీకి రాజీనామా చేశారు. బీజేపీ అభ్యర్థి కామినేని శ్రీను టీడీపీని కలుపుకుని వెళ్తున్నారు తప్ప తమను పట్టించుకోవడం లేదని ఆరోపించారు.