New Virus: భయపెడుతున్న కొత్త వైరస్ డింగా డింగా..అసలేంటిది?

ఒక కొత్త వైరస్ పుట్టుకొచ్చింది. ఉగాండాలో వ్యాపిస్తున్న ఈ కొత్త వైరస్ డింగా డింగా ప్రపంచాన్ని వణికించడానికి రెడీ అయింది. శరీరంలో అస్సలు శక్తి లేకుండా ఊగిపోవడమే దీని లక్షణం.

author-image
By Manogna alamuru
New Update
00

డింగా డింగా..ఇప్పుడు ప్రపంచాన్ని వణికిస్తున్న కొత్త వైరస్. ఇదొక వింత రోగం. ఈ వైరస్ సోకిన బాధితులు వింత వింత చేష్టలతో ప్రవర్తిస్తారు. ఎప్పుడూ ఊగిపోతుంటారు. వీరి బాడీ మీద వీరికి కంట్రోల్ ఉండదు. ఇది చూడ్డానికి డ్యాన్స్ చేసినట్లు ఉంటుంది. ఉన్నట్టుండి పడిపోతారు..లేవలేరు..నడవలేరు. ఈ వింత రోగం ప్రస్తుతం డింగా డింగా..ఉగాండా దేశంలో ప్రజలను పట్టి పీడిస్తోంది. ఇది గనక వ్యాప్తి చెందితే ప్రపంచ మంతా డ్యాన్స్ చేయాల్సిందే అంటున్నారు అక్కడి ఆరోగ్య నిపుణులు. ఉగాండాలోని బుండిబుగ్యో అనే ప్రాంతంలో వేగంగా వ్యాప్తి చెందుతోంది. ముఖ్యంగా ఇది మహిళలకు, బాలికలకు ఎక్కువగా సోకుతోంది. డింగా డింగా వ్యాధి  లక్షణాలు శరీరంలో పెద్దగా వణుకు, జ్వరం, ఆ తర్వాత బలహీన పడటం అని చెబుతున్నారు ఉగాండా హెల్త్ అఫీషియల్స్.  ఇది 1518లో ఫ్రాన్స్ లోని స్ట్రాస్ బర్గ్ లో వచ్చిన డ్యాన్సింగ్ ప్లేగును పోలి ఉందని చెబుతున్నారు. బుండిబుగ్యోలో ఇప్పటివరకు దాదాపు 300 కేసులు నమోదయ్యాయి. అయితే దీని కారణంగా ఇప్పటివరకు ఎటువంటి మరణాలు సంభవించలేదు. చాలా మంది రోగులు సరైన చికిత్సతో వారంలోపు కోలుకుంటున్నారు. 

వైరస్ వ్యాప్తికి కారణాలు..

డింగా డింగా వైరస్ రావడానికి కారణాలు మాత్రం ఇప్పటికీ తెలియడం లేదు ఇది దేని కారణంగా వస్తుందో చెప్పలేక పోతున్నామని డాక్టర్లు అంటున్నారు. పర్యావణ కారకాల ద్వారానే ఇది సోకే అవకాశం ఉందని చెబుతున్నారు. ముందు జ్వరం వస్తుంది. తర్వాత అలసట పెరిగి..బలహీనంగా మారుతున్నారు. కొంతమంది వ్యక్తులు పక్షవాతం వంటి లక్షణాలను ఎదుర్కొంటూ నడవలేని స్థితిలోకి వెళుతున్నారు. దీనికి సరైన మందు కూడా ప్రస్తుతానికి లేదు. 

 

Also Read: KIMS: శ్రీతేజ్ ఆరోగ్యం నిలకడగా ఉంది..హెల్త్‌ బులెటిన్ విడుదల

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు