Allu Arjun: అల్లు అర్జున్‌కు మళ్ళీ షాక్..ఎన్‌హెచ్‌ఆర్సీకి ఫిర్యాదు సంధ్యా థియేటర్ వివాదంలో అల్లు అర్జున్‌కు షాక్‌ల మీద షాక్‌లు తుగులుతూనే ఉన్నాయి. తాజాగా దీనిపై హ్యూమన్ రైట్స్ కు ఫిర్యాదు చేశారు. ప్రచారం మోజులో పడి ప్రాణాలు తీశారని ఫిర్యాదుదారు కంప్లైంట్ చేశారు. By Manogna alamuru 20 Dec 2024 | నవీకరించబడింది పై 20 Dec 2024 21:43 IST in హైదరాబాద్ Latest News In Telugu New Update షేర్ చేయండి పుష్ప–2 ప్రీమియర్ వివాదం అల్లు అర్జును ఇప్పట్లో వదిలేలా కనిపించడం లేదు. ఇప్పటికే సంధ్యా థియేటర్ తొక్కిసలాట కారణంగా ఒకరోజు జైలులో ఉండి బెయిల్ మీద బయటకు వచ్చారు. అయినప్పటికీ ఈ విషయంలో టెన్షన్స్ మాత్రం ఇంకా తగ్గలేదు. రీసెంట్‌గా అల్లు అర్జున్ బెయిల్ రద్దు చేస్తారని...దీనికి సబంధించి హైకోరట్‌లో పిటిషన్ వేయనున్నారని తెలిసింది. దాంతో పాటూ చిక్కడపల్లి పోలీసులు కూడా తొక్కిసలాట కేసులో సంచలన విషయాలు సేకరించారని..వాటి వలన కూడా అల్లు అర్జున్కు బెయిల్ రద్దయ్యే ఛాన్స్ ఉందని అన్నారు. ఇవి కాక ఇప్పుడు మరో ఉచ్చు బన్నీ మెడకు చుట్టుకోనుంది. ఎన్‌హెచ్ఆర్సీకు ఫిర్యాదు తాజాగా అల్లు అర్జున్ మీద హ్యూమ్ రైట్‌కు ఫిర్యాదు వెళ్ళింది. ప్రచారం మోజులో పడి ప్రాణాలు తీశారని ఫిర్యాదు దారు కంప్లైంట్ చేశారని తెలుస్తోంది. ప్రేక్షకులను కంట్రోల్ చేయలేమని పోలీసులు చెప్పినా పట్టించుకోలేదు అని పేర్కొన్న ఫిర్యాదు దారు పుష్ప-2 చిత్ర యూనిట్‌పై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో కోరారు. థియేటర్‌కు షోకాజ్ నోటీసులు.. సంధ్యా థియేటర్ లైసెన్స్ విషయం మీద పోలీసులు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. తొక్కిసలాట కారణంగా ఒకరి మృతికి కారణమైన సంధ్య థియేటర్ లైసెన్స్ ఎందుకు రద్దు చేయకూడదు అని ప్రశ్నిస్తూ షో కాజ్ నోటీసులు జారీ చేశారు.. ఈ నోటీసుల మీద వారం రోజులలో వివరణ ఇవ్వకపోతే లైసెన్సు రద్దు చేస్తామని కూడా హెచ్చరించారు. అయితే ఈ అంశం మీద సంధ్య థియేటర్ ఇంకా స్పందించలేదు. ఈ థియేటర్ సినిమాటోగ్రాఫ్ లైసెన్స్ ఎందుకు రద్దు చేయకూడదని పోలీసులు నోటీసులో అడిగినట్టు తెలుస్తోంది. Also Read: Lok Sabha: జమిలీ ఎన్నికల జేపీసీకి ఛైర్ పర్శన్ నియామకం మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి Advertisment సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి