పుష్ప–2 ప్రీమియర్ షో సందర్భంలో సంధ్యా థియేటర్ దగ్గర జరిగిన తోపులాటలో రేవతి అనే మహిళ చనిపోగా...ఆమె కుమారుడు శ్రీ తేజ్ విపరీతమైన గాయాలతో ఆసుపత్రిలో జాయిన్ అయ్యాడు. బాలుడి తలకు బలమైన గాయాలయ్యాయి. 20 రోజులుగా అతను వెంటిలేటర్ మీద చికిత్స పొందుతున్నాడు. తాజాగా శ్రీ తేజ్ ఆరోగ్య పరిస్థితుల మీద కిమ్స్ వైద్యులు హెల్త్ బులెటిన్ విడుదల చేశారు.
నిలకడగా ఉంది..
శ్రీ తేజ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని చెప్పారు కిమ్స్ డాక్టర్లు. వెంటిలేటర్ పై చికిత్స పొందుతున్నాడని.. ఫీడింగ్ తీసుకోగలుగుతున్నాడని తెలిపారు. అప్పుడప్పుడు పిట్స్ లాంటివి వస్తున్నాయి.. కళ్ళు తెరుస్తున్నాడు, కానీ మనుషుల్ని గుర్తు పట్టడం లేదని చెప్పారు. మరోవైపు శ్రీ తేజ్ ఆరోగ్యం ఖర్చులు అన్నీ హీరో అల్లు అర్జున్ చూసుకుంటున్నాడు. ఇప్పటికే డైరెక్టర్ సుకుమార్, అల్లు అరవింద్, సీపీ సీవీ ఆనంద్ లాంటి పలువురు ప్రముఖులు శ్రీ తేజ్ ఆరోగ్య పరిస్థితి గురించి డాక్టర్లతో మాట్లాడారు. ఎప్పటికప్పుడూ ఆరోగ్య పరిస్థితి గురించి తెలుసుకుంటున్నారు.
Also Read: Delhi: రాహుల్ గాంధీపై నమోదైన కేసు క్రైమ్ బ్రాంచ్‌కు బదిలీ