Ganta Srinivasa Rao: మాజీ మంత్రి గంటాకు మరో షాక్
మాజీ మంత్రి గంటా శ్రీనివాస్ రావుకు ఇండియన్ బ్యాంక్ షాక్ ఇచ్చింది. ఆయనకు చెందిన ప్రత్యూష కంపెనీ ఆస్తులను వేలం వేసేందుకు సిద్ధమైంది. ఈ నెల 25న వేలం నిర్వహిస్తున్నట్లు బ్యాంకు అధికారులు వెల్లడించారు.
మాజీ మంత్రి గంటా శ్రీనివాస్ రావుకు ఇండియన్ బ్యాంక్ షాక్ ఇచ్చింది. ఆయనకు చెందిన ప్రత్యూష కంపెనీ ఆస్తులను వేలం వేసేందుకు సిద్ధమైంది. ఈ నెల 25న వేలం నిర్వహిస్తున్నట్లు బ్యాంకు అధికారులు వెల్లడించారు.
ఆంధ్రాలో రాజకీయాలు మంచి వాడీవేడిగా ఉన్నాయి. ముఖ్యంగా టీడీపీ, జనసేన, బీజేపీల్లో సీట్ల సర్దుబాటు విషయంలో రచ్చరచ్చ అవుతోంది. బీజేపీ పోటీ చేయాలనుకున్న స్థానాల్లో టీడీపీ తన అభ్యర్ధులను ప్రకటించడంతో ఆ పార్టీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
విశాఖ వైసీపీ మాజీ ఎమ్మెల్యే తైనాల విజయ్ కుమార్ ఇంట్లో చోరీ జరిగింది. దొంగలు ఇంట్లో నుంచి డబ్బు, బంగారం ఎత్తుకెళ్లినట్లు విజయ్ కుమార్ భార్య విజయలక్ష్మీ తెలిపారు.పెంపుడు కుక్క వారం క్రితం అనారోగ్యంతో చనిపోవడంతో దుండగులు చొరబడి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు.
బొండా ఉమ, బండారు సత్యనారాయణమూర్తి, గంటా శ్రీనివాసరావు, కళా వెంకట్రావు తదితర సీనియర్లందరికీ షాక్ ఇచ్చారు చంద్రబాబు. ఈ రోజు విడుదలైన టీడీపీ థర్డ్ లిస్ట్ లోనూ వీరికి చోటు దక్కకపోవడం ఏపీ పాలిటిక్స్ లో సంచలనంగా మారింది.
సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో టీడీపీ తన అభ్యర్థుల మూడో జాబితాను విడుదల చేసింది. ఈ లిస్టులో 13 మంది ఎంపీ అభ్యర్థులకు స్థానం కల్పించగా, 11 మంది అసెంబ్లీ అభ్యర్థలకు సీట్లు కేటాయించింది.
విశాఖ డ్రగ్స్ కంటైనర్స్ వెనుక ఉన్న రాజకీయ సంబంధాలు ఒక్కొక్కటిగా బయటకొస్తున్నాయి. సంధ్యా ఆక్వా ఎక్స్పోర్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీతో రెండు కీలక పార్టీలకు చెందిన నేతలకు లింక్లు ఉన్నట్లు తెలుస్తోంది.ఏడుగురు అధికారుల బృందంతో సీబీఐ అధికారులుతనిఖీ నిర్వహిస్తున్నారు.
బ్రెజిల్ నుంచి విశాఖ తీరానికి వచ్చిన ఓ కంటైనర్లో ఏకంగా 25 వేల కిలోల డ్రగ్స్ పట్టుబడటం కలకలం రేపింది. జర్మనీలోని హ్యాంబర్గ్ మీదుగా మార్చి 16న కంటైనర్ విశాఖపట్నానికి వచ్చినట్లు అధికారులు గుర్తించారు.
ఏపీలో 2 రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతవరణ శాఖ వెల్లడించింది. కోస్తాంధ్రలో పలుచోట్ల పిడుగులతో కూడిన భారీ వర్షాలు కురవనున్నాయని తెలిపింది. మత్స్యకారులు మరింత అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు.