TDP Candidates: టీడీపీ ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థుల ప్రకటన.. మరో లిస్ట్ విడుదల! మరో 4 ఎంపీ స్థానాలకు, 9 అసెంబ్లీ స్థానాలకు టీడీపీ అభ్యర్థులను ప్రకటించింది. ఈ మేరకు లిస్ట్ విడుదల చేసింది. ఈ లిస్ట్ లో చీపురుపల్లి ఎమ్మెల్యే అభ్యర్థిగా కళా వెంకట్రావు, భీమిలీ నుంచి గంటా శ్రీనివాసరావు కు అవకాశం దక్కింది. By Nikhil 29 Mar 2024 in ఆంధ్రప్రదేశ్ వైజాగ్ New Update షేర్ చేయండి TDP MP, MLA Candidates List: మరో 4 ఎంపీ సీట్లకు, 9 అసెంబ్లీ సీట్లకు టీడీపీ (TDP) అభ్యర్థులను ప్రకటించింది. ఈ మేరకు జాబితా విడుదల చేసింది. మాజీ మంత్రి, పార్టీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు కళావెంకట్రావును చీపురుపల్లి అభ్యర్థిగా ప్రకటించారు చంద్రబాబు (Chandrababu). మరో మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావుకు (Ganta Srinivasa Rao) భీమిలీ టికెట్ దక్కింది. ఇటీవల పార్టీలో చేరిన గుమ్మనూరు జయరాంను గుంతకల్లు అభ్యర్థిగా ప్రకటించింది టీడీపీ. ఉత్కంఠ రేపుతున్న ఒంగోలు ఎంపీ టికెట్ మాగుంట శ్రీనివాసులు రెడ్డికి దక్కింది. దర్శిలో మాజీ ఎమ్మెల్యే హన్మంతరావు మనవరాలు గొట్టిపాటి లక్ష్మికి అవకాశం ఇచ్చారు చంద్రబాబు. ఇది కూడా చదవండి: నరసాపురం టికెట్ నాకే.. మరో 3 రోజుల్లో కూటమి నుంచి అధికార ప్రకటన: RRR ఎంపీ అభ్యర్థులు: విజయనగరం-అప్పలనాయుడు, ఒంగోలు-మాగుంట శ్రీనువాసులు రెడ్డి, అనంతపూర్- అంబికా లక్ష్మీనారాయణ, కడప-భూపేష్ రెడ్డి ఎమ్మెల్యే: భీమిలి-గంటా శ్రీనివాస రావు రాజంపేట-సుభ్రమణ్యం చీపురుపల్లి-కళా వెంకట్రావు గుంతకల్లు-గుమ్మనూరు జయరాం కదిరి-కే.వెంకట ప్రసాద్ పాడేరు- కిల్లు వెంకట రమేష్ నాయుడు దర్శి-గొట్టిపాటి లక్ష్మి ఆలూరు వీరభద్రగౌడ్ అనంతరపురం అర్బన్-దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ #ap-elections-2024 #tdp-mla-list #tdp #chandrababu మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి