Crime News: విశాఖలో విషాదం..తండ్రి చనిపోయినా వెనకడుగు వెయ్యని విద్యార్థిని..!
విశాఖలో విషాదం చోటుచేసుకుంది. అనారోగ్యంతో తండ్రి సోమేశ్ మృతి చెందగా పుట్టెడు దుఃఖంలోనూ ఇంటర్ పరీక్షకు హాజరయింది ఢిల్లీశ్వరి. అక్క మానసిక స్థితి బాలేకపోవడంతో తానే అంత్యక్రియలు చేయాల్సిన పరిస్థితి. తండ్రి చివరి కోరికను నెరవేర్చేందుకు పరీక్షకు హాజరై అంత్యక్రియల్లో పాల్గొంది.