VISAKHAPATNAM: ఆంధ్ర విశ్వవిద్యాలయం (ఏయూ) లలిత కళల (ఫైన్ ఆర్ట్స్) విభాగంలో "Transformation of the Mediums in Indian Sculpture A Study of Pre-Historic to "Contemporary Period - With Special Reference to Materials, Techniques and Evolving Forms" అనే అంశం పై పరిశోధన చేసిన రవికుమార్ కొడాలికి డాక్టరేట్(Ph.D) మంజూరైంది. కొడాలి సాల్మన్ రాజ్- కొడాలి జయమ్మ దంపతుల కుమారుడైన రవికుమార్ ఆంధ్ర ప్రదేశ్, N.T.R జిల్లా, కొత్తూరు, ఈలప్రోలు గ్రామానికి చెందినవారు. ఈ పురస్కారాన్ని ఆయన ఆచార్య మాచవ రపు ఆదినారాయణ గారి పర్యవేక్షణలో సాధించారు. పరిశోధనను ప్రధానంగా లలిత కళల (Fine Arts) రంగంలోని ముఖ్యమైన అంశాలను విశ్లేషిస్తూ, కళాపరిశోధనలో నూతన దృక్పథాన్ని ప్రవేశపెట్టేలా రూపొందించారు. Also Read: పాట్నాలో ప్రశాంత్ కిశోర్ నిరసన.. లగ్జరీ వ్యానుపై విమర్శలు! పిహెచ్.డి డిగ్రీని ఆంధ్ర విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్ ఆచార్య ఇ.ఎన్. ధనుంజయరావు శనివారం అధికారికంగా ప్రకటించి, అభినందనలు తెలుపుతూ ఆయనకు ఉత్తర్వులు అందజేశారు. ఈ సందర్భంగా ఆచార్య ధనుంజయరావు మాట్లాడుతూ, "ఈ విజయం రవికుమార్ కు మాత్రమే కాక, ఏయూ విశ్వవిద్యాలయానికి కూడా గౌరవం. ఆయన చేసిన పరిశోధన కాలానికి, సాంస్కృతిక మార్పులకు, అలాగే విద్యా రంగానికి ఎంతో విలువైనది. ఆయన కృషిని మెచ్చుకుంటూ, భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని ఆశిస్తున్నాము," అని అన్నారు. Also Read: మల్లారెడ్డి తమ్ముడిపై కేసు.. సీక్రెట్ కెమెరాల వ్యవహారంలో బిగ్ ట్విస్ట్! ఈ విజయంతో రవికుమార్ కొడాలికి కళా పరిశోధనలో కీలక స్థానం దక్కింది. ఆయన పరిశోధన కేవలం విద్యార్థులకే కాక, కళా, సాంస్కృతిక రంగాలలో పనిచేస్తున్నవారికి కూడా దిశా నిర్దేశకంగా మారింది. Also Read: ఏపీకి మరో 52 సంక్రాంతి స్పెషల్ ట్రైన్లు.. లిస్ట్ ఇదే! Also Read: ప్రియాంక గాంధీ బుగ్గల్లా రోడ్లు మారుస్తా : బీజేపీ నేత సంచలన కామెంట్స్