ఎమ్మెల్యేల పార్టీ మార్పుపై సీఎం రేవంత్ రెడ్డి కీలక కామెంట్స్ చేశారు. కండువా కప్పినంత మాత్రాన పార్టీ మారినట్టు కాదు కదా అని సీఎం అన్నారు. ఇవాళ కూడా తాను చాలామందికి కండువాలు కప్పానని, కప్పిన కండువాలో ఏముందో వారికే తెలియదన్నారు. ఎవరింటికైనా వెళ్తే ఏ భోజనం పెడతారో ఎలా తెలుస్తుందని సీఎం ప్రశ్నించారు. బీఆర్ఎస్ ఫిర్యాదు చేసిన ఎమ్మెల్యేల వేతనాల నుంచి రూ.5 వేలు ఇప్పటికే బీఆర్ఎస్ కు అన్నారు సీఎం రేవంత్. ఇవన్నీ టెక్నికల్ గా చూసుకుంటే వాళ్ళు ఏ పార్టీలో ఉన్నారో వారికే తెలియాలని సీఎం తెలిపారు. బీఆర్ఎస్ కు 37 మంది ఎమ్మెల్యేల బలం ఉందని అసెంబ్లీ వేదికగా హరీష్ రావు చెప్పారని రేవంత్ అన్నారు. పార్టీ మారిన ఎమ్మెల్యేల అనర్హతను స్పీకర్ నిర్ణయం తీసుకుంటారని చెప్పారు.
కేసీఆర్ ఫ్యామిలీపై కీలక వ్యాఖ్యలు
కేసీఆర్ ఫ్యామిలీపై సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్,కేటీఆర్, హరీష్ రావు, సంతోష్ రావు కలిసి కవితపై దాడి చేయాలని చూస్తున్నారని అన్నారు. తాను ఎక్కడ కవితకు సపోర్ట్ చేయడం లేదన్న సీఎం.. ఆస్తి పంచాయతీల వల్లనే వారికి ఈ పరిస్థితి వచ్చిందన్నారు. వాళ్ల పంచాయతీకి తనకు ఎలాంటి సంబంధం లేదన్నారు సీఎం. కేసీఆర్ కుటుంబాన్ని తెలంగాణ ప్రజలు బహిష్కరించారని చెప్పారు. మంత్రులు ఎవరి పనులు వారు చేసుకుంటున్నారని సీఎం తెలిపారు. కాళేశ్వరం సీబీఐ విచారణను కేటీఆర్ ఆపుతున్నారని సీఎం రేవంత్ ఆరోపించారు. కేటీఆర్‌కు కిషన్ రెడ్డి సహకరిస్తున్నారని, ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటు వేయకపోవడమే నిదర్శనమని అన్నారు. కిషన్ రెడ్డికి సొంత ఆలోచనలు ఉండవన్నారు.
BIG BREAKING : ఎమ్మెల్యేల పార్టీ మార్పుపై సీఎం రేవంత్ రెడ్డి సంచలన కామెంట్స్
ఎమ్మెల్యేల పార్టీ మార్పుపై సీఎం రేవంత్ రెడ్డి కీలక కామెంట్స్ చేశారు. కండువా కప్పినంత మాత్రాన పార్టీ మారినట్టు కాదు కదా అని సీఎం అన్నారు. ఇవాళ కూడా తాను చాలామందికి కండువాలు కప్పానని, కప్పిన కండువాలో ఏముందో వారికే తెలియదన్నారు.