Breaking: మిస్సింగ్ ఎంపీడీవో వెంకట రమణరావు మృతి.. అధికారికంగా నిర్థారించిన పోలీసులు!
గత కొద్ది రోజులుగా అదృశ్యమైన పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం ఎంపీడీవో మండల వెంకట వెంకటరమణ మృతదేహాన్ని మంగళవారం ఉదయం ఎస్డీఆర్ఎఫ్ బృందం కనుగొంది. ఏలూరు కాల్వలో తూటికాడల మధ్య ఇరుక్కుని ఉన్న మృతదేహాన్ని ఎంపీడీవో వెంకటరమణ మృతదేహంగా పోలీసులు ధృవీకరించారు.