Andhra Pradesh : ఏపీలో 96 మంది డీఎస్పీలపై బదిలీ వేటు!

ఏపీలో 96 మంది డీఎస్పీలను బదిలీ చేస్తున్నట్లు ఏపీ డీజీపీ ద్వారకా తిరుమల రావు ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ట్రంలో నిన్న మొన్నటి వరకు ఐఏఎస్‌, ఐపీఎస్‌ ల బదిలీలు జరగగా..తాజాగా డీఎస్పీల బదిలీలు కూడా మొదలయ్యాయి.

New Update
Andhra Pradesh : ఏపీలో 96 మంది డీఎస్పీలపై బదిలీ వేటు!

DSP Transfers : ఆంధ్రప్రదేశ్‌ (Andhra Pradesh) లో కూటమి ప్రభుత్వం (NDA Government) ఏర్పడిన తరువాత.. ఉన్నతాధికారుల బదిలీపర్వం జోరుగా సాగుతుంది. నిన్న మొన్నటి వరకు ఐఏఎస్‌, ఐపీఎస్‌ అధికారులు దృష్టి ఇప్పుడు డీఎస్పీ (DSP) ల మీద పడింది. సుమారు 96 మంది డీఎస్పీ అధికారులను రాష్ట్ర ప్రభుత్వం బుధవారం బదిలీ చేసింది.

బుధవారం 96 మంది డీఎస్పీలను బదిలీ చేస్తూ డీజీపీ ద్వారకా తిరుమలరావు ఉత్తర్వులు ఇచ్చారు. బదిలీ అయిన వారిలో 57 మంది డీఎస్పీలను హెడ్‌క్వార్టర్స్‌లో రిపోర్టు చేయాలని ఆదేశాలు జారీ చేశారు. బదిలీ అయినవారిలో విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌, సీఐడీ , ఇతర విభాగాల అధికారులు కూడా ఉన్నారు.

Also read: సిగరేట్‌ తాగకపోయినా…లంగ్‌ క్యాన్స్‌ర్‌!

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు