గురుపూర్ణిమ వేడుకల్లో చంద్రబాబు
మంగళగిరిలోని సీకే కన్వెన్షన్ సెంటర్లో శ్రీ రామదూత స్వామి ఆధ్వర్యంలో నిర్వహించిన గురుపూర్ణిమ ఉత్సవంలో సీఎం నారా చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. వేణు దత్తాత్రేయ స్వామికి అభిషేకం, పాదుకపూజ నిర్వహించారు.
మంగళగిరిలోని సీకే కన్వెన్షన్ సెంటర్లో శ్రీ రామదూత స్వామి ఆధ్వర్యంలో నిర్వహించిన గురుపూర్ణిమ ఉత్సవంలో సీఎం నారా చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. వేణు దత్తాత్రేయ స్వామికి అభిషేకం, పాదుకపూజ నిర్వహించారు.
ఏపీలో భారీగా ఐఏఎస్ ల బదిలీలు , నియామకాలు జరిగాయి. ఏకకాలంలో 62 మంది ఐఏఎస్ లు బదిలీ అయ్యారు. ఈ క్రమంలో సెర్ప్ సీఈవో గా వీర పాండియ్యన్, మైనార్టీ సంక్షేమ శాఖ కమిషనర్ గా సీహెచ్ శ్రీధర్ బదిలీ అయ్యారు.
ఢిల్లీలో జగనేం చేస్తాడో కాదు.. మనమేం చేయాలనేదే ముఖ్యమని చంద్రబాబు ఎంపీలతో అన్నారు. ఈ రోజు అమరావతిలో జరిగిన టీడీపీ పార్లమెంటరీ పార్టీ మీటింగ్ లో చంద్రబాబు మాట్లాడుతూ.. జగన్ ను అసలు పట్టించుకోవాల్సిన అవసరమే లేదని అన్నట్లు తెలుస్తోంది.
ఏపీలో విద్యుత్ శాఖ అధికారులతో మంత్రి గొట్టిపాటి రవికుమార్ సమావేశమయ్యారు. ఏపీఈపీడీసీఎల్ అధికారులతో మంత్రి వర్చువల్గా సమీక్షించారు. అల్పపీడన ప్రభావంతో పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నందున్న అధికారులు అప్రమత్తంగా ఉండాలని మంత్రి ఆదేశాలు జారీ చేశారు.
ఎన్టీఆర్ జిల్లా నందిగామలో ఆంధ్ర- తెలంగాణ మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. కట్టలేరు ఉధృతంగా ప్రవహిస్తుండడంతో నందిగామ మం దాములూరు వద్ద అధికారులు రాకపోకలు నిలిపి వేశారు. వాహన దారులు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాలని ఆర్డీవో రవీంద్ర రావు తెలిపారు.
ఎన్టీఆర్ జిల్లా నందిగామ మున్సిపల్ పీఠం కోసం టీడీపీలో పోటా పోటీ నడుస్తోంది. ఛైర్మన్ పదవి తమకు కావాలి అంటే తమకు కావాలని నలుగురు కౌన్సిలర్లు లాబియింగ్ చేస్తున్నారు. ఛైర్మన్ వరలక్ష్మి, వైస్ ఛైర్మన్ నాగరత్నం అనారోగ్య కారణాలతో మృతిచెందగా రెండు వార్డుల్లో ఎన్నికలు జరుగనున్నాయి.
మరో గల్ఫ్ బాధితుడు వీరేంద్ర కుమార్ కు మంత్రి నారా లోకేష్ అండగా నిలిచారు. నకిలీ ఏజెంట్ చేతిలో మోసపోయి సౌదీ అరేబియాలో దుర్భర జీవితం గడుపుతున్న వీరేంద్రను స్వస్థలానికి తిరిగి తీసుకొచ్చే బాధ్యత తనదేనని బాధితుడి కుటుంబానికి హామీ ఇచ్చారు.
శాంతి వ్యవహారంలో తాను ఎవరికీ సంజాయిషీ ఇవ్వాల్సిన అవసరం లేదని విజయసాయిరెడ్డి చెప్పారు. శాంతిని ఇప్పటికీ ఒక కూతురులాగానే భావిస్తున్నానని, ఆమె కూడా తనను తండ్రిలాగే చూస్తుందని అన్నారు. తనకు ఏ పరాయి మహిళతోను అనైతిక/అక్రమ సంబంధాలు లేవన్నారు.
వైసీపీ పాలనలో జరిగిన దారుణాలపై ఎప్పుడూ స్పందించని జగన్ ఇప్పుడు రాష్ట్ర పరిస్థితులపై ప్రధానికి లేఖ రాయడం విడ్డూరంగా ఉందన్నారు బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షురాలు పురందేశ్వరి. ఐదేళ్ల పాలనలో జరిగిన అరాచకాలపై ఆత్మపరిశీలన చేసుకోవాలంటూ విమర్శలు గుప్పించారు.