చంద్రబాబు నివాసంలో రాఖీ సంబరాలు-VIDEO
ఉండవల్లిలోని చంద్రబాబు నివాసంలో రాఖీ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. సీఎంకు బ్రహ్మకుమారీలు రాఖీ కట్టి శుభాకాంక్షలు తెలిపారు. టీడీపీ మహిళా నేతలు చంద్రబాబుకు రాఖీ కట్టేందుకు భారీగా తరలివచ్చారు.
ఉండవల్లిలోని చంద్రబాబు నివాసంలో రాఖీ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. సీఎంకు బ్రహ్మకుమారీలు రాఖీ కట్టి శుభాకాంక్షలు తెలిపారు. టీడీపీ మహిళా నేతలు చంద్రబాబుకు రాఖీ కట్టేందుకు భారీగా తరలివచ్చారు.
గ్రూప్1 మెయిన్స్‌కు 1:100 నిష్పత్తి ప్రకారం అభ్యర్థులను ఎంపిక చేయాలని ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల కూటమి ప్రభుత్వాన్ని కోరారు. సీఎం చంద్రబాబునాయుడు అభ్యర్థుల జీవితాలకు సంబంధించిన అంశాన్ని పరిశీలించి న్యాయం చేయాలంటూ ఎక్స్‌లో పోస్ట్ పెట్టారు.
సీఎం చంద్రబాబు ఈరోజు ఏపీకి రానున్నారు. ఈ నెల 16న ఢిల్లీకి వెళ్లిన ఆయన నిన్న ప్రధాని మోదీతో సహా పలువురు కేంద్ర మంత్రులతో సమావేశమయ్యారు. ఏపీకి రావాల్సిన నిధులు, తాజా రాజకీయ పరిస్థితులపై వారితో చర్చించారు.
ప్రభుత్వ ఉద్యోగుల బదిలీలకు చంద్రబాబు సర్కార్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మొత్తం 12 శాఖల్లో బదిలీలకు ప్రభుత్వం అంగీకారం తెలిపింది. ఈ నెల 19 నుంచి 31 వరకు ఉద్యోగుల బదిలీల ప్రక్రియను నిర్వహించనున్నట్లు వెల్లడించింది. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
AP: గుంటూరు డీఎస్పీ కార్యాలయానికి చేరుకున్నారు వైసీపీ మాజీ మంత్రి జోగి రమేష్. చంద్రబాబు నివాసంపై దాడి కేసులో ఈరోజు ఆయన్ను గుంటూరు డీఎస్పీ విచారించనున్నారు. ఈ కేసులో తనను పోలీసులు అరెస్ట్ చేయకుండా ఉండేందుకు జోగి రమేష్ హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే.
AP: వైసీపీ నేత దేవినేని అవినాష్‌కు బిగ్‌షాక్ తగిలింది. నిన్న రాత్రి దుబాయ్ వెళ్లేందుకు ప్రయత్నం చేయగా హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్‌పోర్టులో అధికారులు ఆయనను అడ్డుకున్నారు. అవినాష్‌పై కేసులు ఉన్నందున ప్రయాణానికి అనుమతి ఇవ్వలేదు.
విజయవాడ నుంచి ఢిల్లీకి ఇండిగో విమాన సేవలు అందుబాటులోకి రానున్నాయని కేంద్రమంత్రి కింజారపు రామ్మోహన్ వెల్లడించారు. ఈ ఏడాది సెప్టెంబర్ 24 నుంచి ఈ విమాన సేవలు ప్రారంభమవుతాయని పేర్కొన్నారు. దీనివల్ల అమరావతి, ఢిల్లీ మధ్య ఉన్న బంధం మరింత బలపడుతుందని అన్నారు.
విజయవాడలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ఏపీ బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం ప్రజల సమస్యల స్వీకరణ కోసం రూపొందించిన ప్రత్యేక వెబ్ సైట్ ను ఆమె ప్రారంభించారు.