ఈరోజు చరిత్రలో లిఖించదగ్గ రోజన ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి అన్నారు. అమరావతి పునర్నిర్మాణం కార్యక్రమానికి ప్రధాని మోదీ ముఖ్య అతిథిగా వచ్చారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ వెంటిలేటర్ మీదున్న ఆంద్రప్రదేశ్‌కు ప్రధాని మెదీ ఆక్సిజన్ అందించారని అన్నారు. మోదీ నాయకత్వంలో ప్రపంచ ఆర్థిక ర్యాకింగ్ భారత్ ఇప్పుడు 5వ స్థానంలో ఉంది. మోదీ నాయకత్వంలో భారత్ అభివృద్ధిలో దూసుకుపోతుందని ఆయన సంతోషం వ్యక్తం చేశారు. ఉగ్రవాదంపై భారత్ జరుపుతున్న పోరుకి మోదీకి మద్దతుగా నిలుస్తామని చంద్రబాబు అన్నారు. మోదీకి నేషనే ఫస్ట్ అని చెప్పుకొచ్చారు.
కేంద్ర తీసుకున్న కులగణన నిర్ణయాన్ని స్వాగతిస్తున్నట్లు బాబు తెలిపారు. కులగణన ఓ గేమ్ ఛేంజర్ అని ప్రసంశించారు. ఏపీ రాజధాని అమరావతిలో 18 ప్రాజెక్టులకు ఆరోజు మోదీ శంకుస్థాపన చేశారు. శంకుస్థాపన హైకోర్టు, సెక్రటేరియట్, అసెంబ్లీ భవనాలు, న్యాయమూర్తు నివాస సముదాయల నిర్మాణ పనులు మోదీ ప్రారంభించారు. మూడేళ్లలో అమరావతి నిర్మాణాన్ని పూర్తి చేస్తాం.. ఆంధ్రప్రదేశ్‌లో రాజధాని ప్రారంభానికి మోదీ రావాలని కోరారు. అమరావతిని వరల్డ్ క్లాస్ సిటీగా మారబోతుందని అన్నారు. ఇక్కడ క్వాంటమ్ వ్యాలీ ఏర్పాటు చేస్తామన్నారు. మోత్తం 94 ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టునట్లు ముఖ్యమంత్రి తెలియజేశారు.
(latest-telugu-news | andhra-padesh | pm modi | amaravati restart | cm-chandrababu-naidu)