ఇంద్రకీలాద్రిపై నేటి భవానీ దీక్షలు ప్రారంభం విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై నేటి నుంచి భవానీ దీక్షలు ప్రారంభం కానున్నాయి. ప్రతీ ఏడాది కార్తీక మాసంలో ఈ భవానీ దీక్షలు ప్రారంభం అవుతాయి. మొత్తం 40 రోజుల పాటు భక్తులు దీక్షలో ఉండి అమ్మవారిని భక్తి శ్రద్ధలతో పూజించడం వల్ల కోరిక కోరికలు నెరవేరుతాయని నమ్ముతారు. By Kusuma 11 Nov 2024 in ఆంధ్రప్రదేశ్ విజయవాడ New Update షేర్ చేయండి విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న కనకదుర్గమ్మను భక్తులు ఎంతో భక్తితో కొలుస్తారు. ప్రత్యేకమైన రోజుల్లోనే కాకుండా ఏడాది మొత్తం కూడా విజయవాడ కనకదుర్గమ్మను పూజిస్తారు. అయితే ఇంద్రకీలాద్రిపై నేటి నుంచి భవానీ దీక్షలు ప్రారంభం కానున్నాయి. భవానీ దీక్ష వేయడం వల్ల కోరిన కోర్కెలు నెరవేరడంతో పాటు ఆయురారోగ్య ఐశ్వర్యాలు ఇంట్లో ఉండటంతో పాటు పాపాలు అన్ని తొలగిపోతాయని భక్తులు నమ్ముతారు. ఇది కూడా చూడండి: AP Budget 2024: ఏపీ బడ్జెట్లో అత్యధిక నిధులు బీసీలకే.. ఎన్ని వేల కోట్లో తెలుసా? మొత్తం 40 రోజుల పాటు.. ప్రతీ ఏడాది కార్తీక మాసంలో ఈ భవానీ దీక్షలు ప్రారంభం అవుతాయి. ఈ రోజు ప్రారంభమయ్యి.. మొత్తం 40 రోజుల పాటు దీక్షలో అమ్మవారిని భక్తి శ్రద్ధలతో పూజిస్తారు. ప్రతీ ఏడాది లక్షల మంది ఈ మాలను ధరిస్తారు. దుర్గగుడిలో 1979లో ఈ భవానీ దీక్షలు ప్రారంభమయ్యాయి. అప్పటి నుంచి ప్రతీ ఏడాది క్రమం తప్పకుండా దీక్షలు చేపడుతున్నారు. ఈ దీక్షలు అర్దమండల విరమణ డిసెంబర్ 5న ముగిస్తుంది. పూర్తి దీక్ష విరమణ డిసెంబర్ 25తో ముగిస్తుంది. ఇది కూడా చూడండి: TGఉపాధ్యాయ ఉద్యోగాల ఎంపికలో గందరగోళం...విధుల నుంచి మరో యువతి తొలగింపు! భక్తులు భవానీ దీక్షలను స్వీకరించేందుకు మహా మండపం ఆరో అంతస్తులో ఉత్సవ మూర్తి వద్ద, ఘాట్‌రోడ్డు ఆరంభంలోని కామథేను అమ్మవారి ఆలయం వద్ద దేవస్థానం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. భక్తులు పవిత్ర కృష్ణానదిలో పుణ్యస్నానాలు ఆచరించిన అనంతరం అమ్మవారి ఆలయంతో పాటు గురు భవానీల పీఠాల వద్ద దీక్షలను స్వీకరించవచ్చు. ఇది కూడా చూడండి: BREAKING: RGVకి చంద్రబాబు సర్కార్ షాక్.. ఏపీలో కేసు! అమ్మవారికి ఈ సమయంలో ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. మేళతాళాలు, మంగళవాయిద్యాల నడుమ మహా మండపంలో పూజలు నిర్వహిస్తారు. అర్చకులు, గురుభవానీల చేతుల మీదగా భకులు దీక్షాధారణ చేపడతారు. ఇది కూడా చూడండి: Trump: పుతిన్‌కు ఫోన్ చేసిన ట్రంప్.. ! #kanaka durga temple మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి