విజయ్‌సాయి రెడ్డి సంచలన పోస్ట్.. జగన్‌ను మదురోతో పోలుస్తూ ఇంట్రెస్టింగ్ కామెంట్స్

మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి ఇంట్రెస్టింగ్ ట్వీట్ చేశారు. పరోక్షంగా వైసీపీ అధినేత జగన్‌ను టార్గెట్ చేశారు. నికోలస్‌ మధురోతో జగన్‌ను పోల్చుతూ రాసుకొచ్చారు.

New Update

మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి ఇంట్రెస్టింగ్ ట్వీట్ చేశారు. పరోక్షంగా వైసీపీ అధినేత జగన్‌ను టార్గెట్ చేశారు. నికోలస్‌ మధురోతో జగన్‌ను పోల్చుతూ రాసుకొచ్చారు.''అమ్ముడు పోయిన కోటరీల మధ్య బందీలుగా ఉన్న ఓ ప్రజా నాయకులారా ఆలోచించుకోండి. భవిష్యత్తులో మీకూ ఏం జరగబోతోందో ఇప్పటికైనా గుర్తించండి.వెనెజులాలో ఎంతో ప్రజాదరణ ఉన్నా.. ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్, ఇంటెలిజెన్స్ చుట్టూ ఉన్నా.. మధురోను, అతని భార్యను అమెరికా ఎత్తుకుపోయింది. ఎందుకంటే ఆయన చుట్టూ ఉన్నవారంతా అమ్ముడుపోయారంటూ'' రాసుకొచ్చారు.

విజయ్ సాయి రెడ్డి చేసిన కామెంట్స్‌పై వైసీపీ నేతలు విరుచుకుపడుతున్నారు. ఆ కోటరీలో అన్ని పదవులు అనుభవించి, ఇప్పుడు బయటకి వచ్చి నీతులు చెప్పడం నమ్మక ద్రోహం కాదా అంటూ ఓ యూజర్ నిలదీశారు. ఆ కోటరీ ఏదో చెప్పి, బయటకు పంపి నువ్వే నమ్మకంగా ఉండొచ్చు కదా అంటూ మరో వ్యక్తి రాసుకొచ్చారు. అన్ని తెలిసి మీరెలా అమ్ముడుపోయారంటూ మరో యూజర్ విజయ్ సాయి రెడ్డిని విమర్శించారు.

Advertisment
తాజా కథనాలు