/rtv/media/media_files/2025/07/06/vande-bharat-express-hits-a-bull-2025-07-06-17-12-40.jpg)
Vande Bharat Express hits a bull
ప్రయాణికులకు అత్యాధునిక సౌకర్యాలు అందిస్తూ, వేగవంతమైన ప్రయాణానికి ప్రతీకగా నిలుస్తున్న వందే భారత్ రైలుకు తాజాగా పెను ప్రమాదం తృటిలో తప్పింది. ఏపీలోని ఓ రైల్వే స్టేషన్ సమీపంలో రైల్వే ట్రాక్‌పై ఊహించని విధంగా ఆటంకం వచ్చింది. అయితే లోకో పైలట్ చాకచక్యంగా వ్యవహరించడంతో పెద్ద ప్రమాదం తప్పింది. పూర్తి వివరాల్లోకి వెళితే..
Also Read: రోజూ ఆయన కొట్టేవాడు..ఈరోజు నేను కొట్టా..ఒక దెబ్బకే పోయాడు...భార్య సంచలనం
Vande Bharat Accident
ఇవాళ ఉదయం వందే భారత్ ఎక్స్‌ప్రెస్ విశాఖపట్నం నుంచి సికింద్రాబాద్ వైపుగా వెళ్తుంది. అదే సమయంలో తాళ్లపూసలపల్లి రైల్వే స్టేషన్ సమీపంలో ఈరోజు పెను ప్రమాదం తృటిలో తప్పింది. వేగంగా వచ్చిన వందే భారత్ ట్రైన్ ట్రాక్‌పై ఉన్న ఓ ఎద్దును ఢీకొట్టింది. దీంతో ఆ ఎద్దు అక్కడికక్కడే మృతి చెందింది.
మరోవైపు వందే భారత్ ట్రైన్ ముందు భాగంలో ఉన్న ఇంజిన్ సైతం బాగా డ్యామేజ్ అయింది. ఈ ఘటనతో వందే భారత్ రైలు కొంత సమయం అక్కడే నిలిచిపోయింది. అనంతరం అధికారులు అక్కడకు చేరుకుని ఘటనను పరిశీలించి ట్రైన్‌ను పంపించేశారు. ప్రస్తుతం ఈ ఘటన హాట్ టాపిక్‌గా మారింది.
Also Read: పోలీసులనే మోసం చేసిన యువతి.. యూనిఫాంలో ట్రైనింగ్ చేస్తూ
ఎప్పటికప్పుడు ఘటనలు
వందే భారత్ రైళ్లు ప్రారంభమైనప్పటి నుండి తరచుగా పశువులను ఢీకొడుతున్న సంఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. ఇప్పటికే గుజరాత్, తెలంగాణ, బీహార్ వంటి రాష్ట్రాల్లోనూ ఇలాంటి ఘటనలు జరిగాయి. పశువులు రైల్వే ట్రాక్‌లపైకి రాకుండా నిరోధించడానికి రైల్వే శాఖ పలు చర్యలు తీసుకుంటున్నప్పటికీ, ఇలాంటి ప్రమాదాలు పునరావృతం కావడం ఆందోళన కలిగిస్తోంది. ట్రాక్‌ల పక్కన కంచెలు ఏర్పాటు చేయడం, స్థానిక ప్రజలకు అవగాహన కల్పించడం వంటి చర్యలు మరింత పటిష్టంగా అమలు చేయాలని ప్రయాణికులు, నిపుణులు సూచిస్తున్నారు.
ఈరోజు జరిగిన ఘటనపై రైల్వే అధికారులు మరింత లోతుగా విచారణ చేపట్టారు. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు జరగకుండా తీసుకోవాల్సిన చర్యలపై దృష్టి సారించారు.