/rtv/media/media_files/2025/01/31/SYsxAwPEUvxCCYboLcDW.jpg)
TTD TEMPLE IN KUMBH MELA
THIRUMALA : మహాకుంభ మేళాలో టీటీడీ ఉద్యోగి ఒకరు అదృశ్యమైనట్లు తెలుస్తోంది. టీటీడీ ఆధ్వర్యంలో శ్రీవారి నమూనా ఆలయాన్ని ప్రయాగ్‌రాజ్‌లో ఏర్పాటు చేసి, విధి నిర్వహణకు 200 మంది ఉద్యోగులు, సిబ్బందిని పంపించారు. అక్కడ విధులు నిర్వహిస్తు్న్న సిబ్బందిలో ఒకరు కనిపించకుండా పోయినట్లు స్థానిక పోలీసులకు అధికారులు ఫిర్యాదు చేశారు.
ఇది కూడా చదవండి: live-in relationship: పెళ్లి కాకున్నా కలిసి జీవించాలంటే ఈ రూల్స్ పాటించాలి
కాగా దేశవ్యాప్తంగా ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఎక్కడ జరిగిన తిరుమల తిరుపతి దేవస్థానం శ్రీవారి ఆలయ నమునాను ఏర్పాటు చేసి టీటీడీ ప్రత్యేకతను ప్రచారం చేయడం జరుగుతుంది. టీటీడీ కి సంబంధించిన క్యాలెండర్లు, లడ్డూలు ఇతర ఉత్పత్తులను విక్రయించడం జరుగుతుంది. అందులో భాగంగా మహాకుంభ మేళాలోనూ ఆలయ నమూన ఏర్పాటు చేశారు. కాగా కుంభమేళా ప్రారంభమైనప్పటి నుంచి ప్రయాగ్‌రాజ్‌లో 200 మంది ఉద్యోగులు, సిబ్బంది విధుల నిర్వహిస్తున్నారు. కాగా ప్రారంభం నుంచి అకడే ఉన్న దీవేటి సుబ్రహ్మణ్యం అనే ఉద్యోగి బుధవారం నుంచి కనిపించడం లేదు. అన్ని ప్రాంతాల్లో వెతికినప్పటికీ ఆచూకీ లభించకపోవడంతో స్థానిక పోలీసులకు, టీటీడీ ఈవోకు ఉద్యోగులు సమాచారం అందించారు.
ప్రయాగ్‌రాజ్‌లోని సెక్టార్6లో విధులు నిర్వహిస్తున్న సుబ్రహ్మణ్యం బుధవారం సాయంత్రం సబ్బు కోసం బయటకు వెళ్లి తిరిగి రాలేదు. దీంతో ఆయన కోసం విజిలెన్స్ అధికారులు తీవ్రంగా గాలించారు. ఎంతకీ ఆచూకీ లభ్యం కాకపోవడంతో దారాగంజ్ పోలీస్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కాగా ఉద్యోగి అదృశ్యం కావడంపై సంబంధిత అధికారులు ప్రయాగ్‌రాజ్ లోని పోలీసులతో ప్రత్యేకంగా చర్చిస్తున్నారు.
Also Read: TG, AP MLC Elections: తెలంగాణ, ఏపీలో ఎమ్మెల్సీ ఎన్నికలకు షెడ్యూల్.. వివరాలివే!
ఇక ఈ వ్యవహారంపై టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి స్పందించారు. టీటీడీ ఉద్యోగి దీవేటి సుబ్రహ్మణ్యం అదృశ్యంపై పూర్తి సమాచారం అందించాలని అక్కడ ఉన్న ఇతర అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. టీటీడీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన శ్రీవారి నమూనా ఆలయంలో.. కుంభమేళా ప్రారంభం అయిన జనవరి 13వ తేదీ నుంచి సేవలు అందిస్తున్నారు. దీవేటి సుబ్రహ్మణ్యం ఆచూకీ కోసం అన్ని ప్రయత్నాలు చేస్తున్నామని టీటీడీ ఉన్నతాధికారులు వెల్లడించారు.