హిందువులు జరుపుకునే పండగల్లో వైకుంఠ ఏకాదశి కూడా ఓ ముఖ్యమైన పర్వదినం.ఈ రోజున చాలా మంది హిందువులు ఏదైనా వైష్ణవ క్షేత్రంలో స్వామివారిని ఉత్తర ద్వార దర్శనం చేసుకోవాలని అనుకుంటారు. ఈ నేపథ్యంలో కలియుగ వైకుంఠంగా వెలుగొందుతున్న తిరుమలలో కొలువైన శ్రీవారిని వైకుంఠ ఏకాదశి రోజున ఉత్తర ద్వార దర్శనం చేసుకోవాలని ఎంతో మంది భావిస్తుంటారు.
Also Read:భక్తులు భారీగా వస్తారని తెలిసి ఎందుకు ఏర్పాట్లు చేయలేదు..Chandrababu
వైకుంఠ ఏకాదశి నుంచి స్వామివారు 10 రోజుల పాటు ఉత్తర ద్వారం దర్శనం ఇవ్వనున్నారని టీటీడీ తెలిపింది. అయితే టోకెన్లు, లేదా టికెట్లు ఉన్నవారికి మాత్రమే ఈ పది రోజులు స్వామివారిని దర్శించుకునే వీలు ఉంటుందని టీటీడీ స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో తిరుమలలో వైకుంఠ ఏకాదశి రోజున ఉత్తర ద్వారం దర్శనం చేసుకోవాలనుకునే భక్తులు తిరుమల తిరుపతిలోని వివిధ ప్రాంతాల్లో ఇచ్చే టోకెన్ల కోసం పోటెత్తారు. తిరుమలలోని వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఉత్తర ద్వారం ద్వారా దర్శనం కోసం బుధవారం టోకెన్ల పంపిణీ టీటీడీ మొదలు పెట్టింది.
Also Read:Us:లాస్ ఏంజెల్స్‌లో కార్చిచ్చు..అగ్నికి ఆహుతైన బైడెన్ కుమారుడి ఇల్లు
ఈ సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో ఆరుగురు మృతి చెందగా, పదుల సంఖ్యలో గాయాలపాలయ్యారు. అయితే వైకుంఠ ఏకాదశి సందర్భంగా తిరుమలలో ఇంత రద్దీ ఎందుకు ఏర్పడుతుంది.ఎందుకు టోకెన్ల కోసం భక్తులు పోటీపడుతున్నారు? అనే విషయాలను ఈ స్టోరీలో తెలుసుకుందాం...
వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఏడుకొండల వాడు కొలువైన తిరుమలపై కాలు తీసి కాలుపెట్టడానికి ఖాళీ ఉండదు అన్నట్లు భక్తుల రద్దీ ఏర్పడుతుంది. వైకుంఠ ఏకాదశి నుంచి పది రోజుల పాటు స్వామివారు ఇచ్చే ఉత్తర ద్వార దర్శనం ద్వారా స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు భారీగా తరలివస్తారు.
తిరుమలలో జరిగే ఉత్సవాలను చారిత్రాత్మకంగా చూస్తే రెండు ప్రధాన ఘట్టాలున్నాయి. ఒకటి వార్షిక బ్రహ్మోత్సవాలు. ఈ ఉత్సవాలు తొమ్మిది రోజుల పాటు ఎంతో వేడుకగా జరుగుతాయి. దేశ విదేశాల నుంచి భక్తులు స్వామివారిని దర్శించుకునేందుకు తిరుమలకు వస్తుంటారు.
అయితే ఈ వైకుంఠ ఏకాదశిని కొన్ని ఏళ్ల క్రితం వరకూ ఒకే రోజు చేశారు. అయితే క్రమంగా వేంకటేశ్వరుడిని ఉత్తర ద్వార దర్శనం చేసుకునేందుకు భక్తులు బారులు తీరడం మొదలు పెట్టారు.
1980, 1990లలో లయ అధికారులు వైకుంఠ ద్వాదశిని అదనపు పవిత్రమైన రోజుగా గుర్తించడం ద్వారా ఉత్సవాలను పొడిగించారు.మకర సంక్రాంతి పండుగకు ముందు రెండు రోజులు అత్యంత పవిత్రమైనవిగా భావిస్తారు.
వైకుంఠ ఏకాదశికి 41 రోజుల ముందుగానే భక్తులు గోవింద మాల ధరించి, చెప్పులు లేకుండా నడుస్తూ తిరుమలకు చేరుకుంటారు. వైకుంఠ ఏకాదశి రోజున స్వామివారి దర్శనానికి సిద్ధమయ్యారు. చాలా మంది యాత్రికులు సుదూర ప్రాంతాల.. కొన్నిసార్లు వందల కిలోమీటర్ల నడిచి తిరుమలకు చేరుకుంటారు.
భక్తుల రద్దీని పరిగణనలోకి తీసుకున్న పరిపాలన, దేశవ్యాప్తంగా ఉన్న హిందూ మత పెద్దలను సంప్రదించిన తర్వాత, 2021-2022లో వైకుంఠ ఏకాదశి , ద్వాదశి లో మాత్రమే కాదు ఏకంగా స్వామివారిని ఉత్తర ద్వార దర్శనం పది రోజుల పాటు నిర్వహించాలనుకున్నారు. అలా ఇప్పుడు పది రోజుల పాటు స్వామివారిని ఈ ఉత్తర ద్వారం నుంచి దర్శించుకునే వీలు కల్పించారు. ఈ నిర్ణయం తర్వాత శ్రీ వేంకటేశ్వరుని గర్భగుడి దగ్గర ఉన్న ఉత్తర ద్వారం పది రోజుల పాటు తెరిచి ఉంచుతుంది.
Also Read:Lay Offs: కొత్త ఏడాదిలో మొదలైన కోతలు..మైక్రోసాఫ్ట్ లో హూస్టింగ్ లు!
Also Read:L And T: భార్యలను ఎంతసేపు చూస్తూ కూర్చుంటారు..ఆదివారాలు పని చేయండి!