తిరుపతి లడ్డూలో బీఫ్ టాలో.. అసలు బీఫ్ టాలో అంటే ఏంటో తెలుసా? తిరుపతి లడ్డూ తయారీలో జంతు కొవ్వు కలిపారన్న అంశం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమవుతోంది. అందులో బీఫ్ టాలో కలిసిందని ల్యాబ్ రిపోర్టులో తేలడం సంచలనం రేపుతోంది. అయితే బీఫ్ టాలో గురించి తెలుసుకోవడానికి ఈ ఆర్టికల్ చదవండి By B Aravind 21 Sep 2024 | నవీకరించబడింది పై 21 Sep 2024 21:12 IST in ఆంధ్రప్రదేశ్ తిరుపతి New Update షేర్ చేయండి తిరుపతి లడ్డు..! ఇప్పుడు ఇదే ట్రెండింగ్ వార్డ్..! దేశవ్యాప్తంగా ఎక్కడ చూసినా తిరుమల లడ్డు గురించే చర్చ..! దేవుడి ప్రసాదానికి తయారు చేసే లడ్డూలో జంతువులకు సంబంధించిన కొవ్వులను కలిపారని టీడీపీ నేతలు చెబుతుండడం సంచలనం రేపుతోంది. గత వైసీపీ ప్రభుత్వ హయంలో ఇలా జరిగిందని పలు ల్యాబ్ రిపోర్టులను చూపిస్తోంది టీడీపీ. ఇందులో నిజనిజాలు ఎంతన్నది తేలాల్సి ఉన్నా ఇది భక్తుల నమ్మకానికి చెందిన అంశంకావడంతో అందరి నోటా దీనికి సంబంధించిన చర్చే జరుగుతోంది. లడ్డులో బీఫ్ టాలో కలిసిందని ల్యాబ్ రిపోర్టులో ఉండడం ఈ వివాదానికి అతి పెద్ద కారణం! తిరుపతి లడ్డు తయారీలో బీఫ్ టాలోను ఉపయోగించారని టీడీపీ చెబుతోంది. గుజరాత్‌కు చెందిన పశువుల ల్యాబొరేటరీ ఈ కల్తీ విషయాన్ని నిర్ధారించినట్టు టీడీపీ నేతలు ప్రకటించడంతో పెద్ద వివాదం చెలరేగింది. బీఫ్ టాలో తయారీలో గొడ్డు మాంసం ముక్కులను వాడుతారు. ఈ మాంసం నుంచి తీసిన స్వచ్ఛమైన కొవ్వును ముందుగా కరిగిస్తారు. దాన్ని ద్రవంగా మార్చడం ద్వారా దీన్ని తయారు చేయవచ్చు. అది చల్లబడినప్పుడు తేలికైన పదార్థంగా ఘనీభవిస్తుంది. రూమ్ టెంపరేచర్ వద్ద మృదువైన వెన్న వలె ఆ టాలో కనిపిస్తుంది. Also Read: ఏ ఒక్కరినీ వదలి పెట్టం.. లడ్డూ కల్తీపై చంద్రబాబు సంచలనం! అటు లడ్డులో పందికొవ్వు, చేప నూనె ఉన్నట్లు కూడా ల్యాబ్ రిపోర్టులు చెబుతున్నాయి. జులై 8న ల్యాబ్‌కు శాంపిల్స్ పంపించగా జులై 17న ఈ మేరకు ల్యాబ్ నివేదిక ఇచ్చింది. లడ్డులో సోయాబీన్, సన్‌ఫ్లవర్, ఆలివ్, రాప్‌సీడ్, లిన్సీడ్, గోధుమ జెర్మ్, మొక్కజొన్న జెర్మ్, కాటన్ సీడ్, కొబ్బరి, పామ్ కెర్నల్, పామ్ ఆయిల్ లాంటి శాఖాహార పదార్థాలను కూడా ఉపయోగించినట్టుగా రిపోర్టులో ఉంది. అయితే ఈ ల్యాబ్ రిపోర్టు గురించి వేంకటేశ్వర స్వామి ఆలయాన్ని నిర్వహించే తిరుమల తిరుపతి దేవస్థానం-టీటీడీ నుంచి అధికారిక ధృవీకరణ రాలేదు. తిరుమల ఆలయంలో పంపిణీ చేసే ప్రసాదంపై ప్రశ్నలు తలెత్తడం ఇదేం మొదటిసారి కాదు. గత వైసీపీ ప్రభుత్వంలో నెయ్యి కొనుగోళ్లలో ఎలాంటి నాణ్యత ప్రమాణాలు పాటించలేదని అప్పుడు ప్రతిపక్షంలో ఉన్న టీడీపీ అనేకసార్లు ఆరోపించింది కూడా. అయితే ఇప్పుడు మాత్రం ఏకంగా లడ్డులో జంతువుల కొవ్వు కలిపారని ఓ నివేదిక చెప్పడం ప్రకంపనలు రేపుతోంది. Also Read: 12 పాసయితే చాలు..రైల్వేలో 3445 ఉద్యోగాలు #telugu-news #Tirupati Laddu మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి