JOBS: 12 పాసయితే చాలు..రైల్వేలో 3445 ఉద్యోగాలు

రైల్వేలో ఎప్పటి నుంచో ఖాళీగా ఉండిపోయిన మూడువేలకు పైగా పోస్టులను భర్తీ చేయాలని రైల్వేశాఖ నిర్ణయించింది. అండర్ గ్రాడ్యుయేట్ స్థాయిలో నాన్-టెక్నికల్ పాపులర్ కేటగిరీలో యూజీ స్థాయిలో 3,455 ఉద్యోగాలను ఇందులో భర్తీ చేయనున్నారు.

New Update
Railway Jobs : ఉద్యోగార్థులకు కేంద్రం గుడ్‌న్యూస్.. రైల్వే రిక్రూట్‌మెంట్‌పై కీలక ప్రకటన!

 RRB JOBS: 

ఆర్ఆర్ఆబీలో అండర్ గ్రాడ్యుయేట్ ఉద్యోగాల కోసం రైల్వే బోర్డు దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. నాన్-టెక్నికల్ పాపులర్ కేటగిరీలో యూజీ స్థాయి రిక్రూట్‌మెంట్ కోసం రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డ్ ఆన్‌లైన్ దరఖాస్తులు తీసుకుంటోంది. ఈరోజు నుంచే ఆన్‌లైన్‌లో అప్లికేషన్లను పెట్టుకోవచ్చును. rrbapply.gov.in అధికారిక వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. అక్టోబరు 20 చివరి తేదీ కాగా.. ఫీజును డిపాజిట్ చేయడానికి చివరి తేదీ అక్టోబరు 22 వరకు గడువు ఉంది. మొత్తం 3,445 ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. 

ఉద్యోగాల వివరాలు..

కమర్షియల్ కమ్ టికెట్ క్లర్క్: 2022 పోస్టులు
అకౌంట్స్ క్లర్క్ కమ్ టైపిస్ట్: 361 పోస్టులు
జూనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్: 990 పోస్టులు
రైళ్లు క్లర్క్: 72 పోస్టులు
మొత్తం ఖాళీలు: 72 

అర్హత..

గుర్తింపు పొందిన బోర్డు నుంచి 12వ (10+2) పరీక్ష ఉత్తీర్ణులైన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చును. జనరల్, ఓబీసీ,ఈడబ్ల్యూఎస్ కేటగిరీ అభ్యర్థులు 12వ తరగతిలో కనీసం 50 శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించాలి. ఎస్‌ఏసీ, ఎస్టీ, వికలాంగ అభ్యర్థులకు 50 శాతం కన్నా తక్కువ ఉత్తీర్ణత ఉన్నా సరిపోతుంది. 

వయోపరిమితి: 

దరఖాస్తుదారుల వయస్సు జనవరి 1, 2025 నాటికి 18 ఏళ్ళ నుంచి 35 ఏళ్ళ మధ్యలో ఉండాలి. రిజర్వ్‌డ్ కేటగిరీ అభ్యర్థులకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం గరిష్ట వయోపరిమితిలో సడలింపు ఇస్తారు.

అప్లికేష్ ఫీజు:
జనరల్/ఓబీసీ/ఈడబ్ల్యూఎస్ కేటగిరీ అభ్యర్థులు రూ.500, ఎస్సీ/ఎస్టీ/పీడబ్ల్యూడీ అభ్యర్థులు రూ.250, మహిళా అభ్యర్థులు రూ.250 చెల్లించాలి.

Also Read:  Tirupathi: తిరుపతిలో మూడు రోజుల పాటూ మహా శాంతి యాగం‌‌–టీటీడీ నిర్ణయం

 

Advertisment
Advertisment
తాజా కథనాలు