Tirupati Laddu: ఏ ఒక్కరినీ వదలి పెట్టం.. లడ్డూ కల్తీపై చంద్రబాబు సంచలనం!

తిరుమల పవిత్రతకు పూర్వ వైభవం తీసుకొస్తామని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. ఈ రోజు మీడియా చిట్ చాట్ లో ఆయన మాట్లాడుతూ.. లడ్డూ కల్తీ విషయంలో తప్పు చేసిన ఏ ఒక్కరినీ వదలిపెట్టమన్నారు. తప్పు చేయడమే కాక జగన్ ఎదురు దాడి చేసే ప్రయత్నం చేస్తున్నాడని ఫైర్ అయ్యారు.

New Update
Chandrababu Tirupati Laddu

టీడీపీ లడ్డూలో కల్తీ అంశం రాష్ట్ర రాజకీయాల్లో దుమారం రేపుతున్న వేళ చంద్రబాబు నాయుడు మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ రోజు మీడియాతో ఆయన చిట్ చాట్ చేశారు. తిరుమల పవిత్రతకు పూర్వ వైభవం తీసుకొస్తామన్నారు. తప్పు చేసిన ఏ ఒక్కరినీ వదలి పెట్టమని స్పష్టం చేశారు. తప్పు చేసిన వారు చరిత్ర హీనులుగా మిగిలిపోయేలా కఠినంగా శిక్షిస్తామన్నారు. గత ప్రభుత్వంలో రాముడి తల తీసేస్తే దిక్కులేదని ఆవేదన వ్యక్తం చేశారు. అంతర్వేదిలో రథం తగలపెడితే పట్టించుకోలేదని ఫైర్ అయ్యారు. వైసీపీ పాలనలో ఎన్నో దేవాలయాలపై దాడులు జరిగినా చర్యలు లేవన్నారు. తిరుమల శ్రీవారి విషయంలో తాను ఒకటికి పదిసార్లు ఆలోచిస్తానన్నారు. వాస్తవాలతో భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయనే బాధ ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. అలాగని దుర్మార్గాలు చూస్తూ ఊరుకోలేమన్నారు. లడ్డూను కల్తీ చేయడమే కాక జగన్ ఎదురుదాడి చేస్తారా? అని ఫైర్ అయ్యారు.

లడ్డూ తయారీలో రివర్స్ టెండరింగా?

ప్రజలు గుణపాఠం చెప్పినా బుద్ధి మార్చుకోరా? అని వైసీపీ నేతలను ప్రశ్నించారు చంద్రబాబు. ఆవు నెయ్యి కేవలం రూ.320కే ఎలా వస్తుందని అన్నారు. శ్రీవారికి నైవేథ్యంగా పెట్టే లడ్డూ తయారీలో రివర్స్ టెండర్లు ఏంటన్నారు. తాము అధికారంలోకి వచ్చిన వెంటనే తిరుమలను ప్రక్షాళన చేయాలని కొత్త ఈవోను ఆదేశించామన్నారు. తమ ఆదేశాలతో ఈవో అనేక చర్యలు తీసుకున్నారన్నారు. లడ్డూ నాణ్యత పెంచారన్నారు. ప్రక్షాళనలో భాగంగా పలు కంపెనీలను బ్లాక్ లిస్టులో పెట్టారన్నారు. లడ్డూ నాణ్యత పెంచడం కోసం నందిని సంస్థ నెయ్యిని కోనుగోలు చేశారన్నారు. ఏడుకొండల వాడే తనతో లడ్డూ వ్యవహారంపై మాట్లాడించాడేమోనన్నారు.

చాలా మంది తిరుమల శ్రీవారి లడ్డూ కన్నా బాగా చేయాలని ప్రయత్నించారన్నారు. కానీ అది సాధ్యం కాలేదన్నారు. అయోధ్యలో కూడా తిరుమల లాంటి లడ్డూ తయారు చేయాలని చేసిన ప్రయత్నం ఫలించలేదన్నారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఏడు కొండలను రెండు అన్నప్పుడు  వ్యతిరేకించాం.. పోరాడాం.. అమరావతితో రూ. 250 కోట్లతో శ్రీవారి టెంపుల్ కడదాం అనుకుంటే దాన్ని కుదించారు అని ఆవేదన వ్యక్తం చేశారు.. రాష్ట్రంలోని అన్ని దేవాలయాల్లో పరీక్షలు, సంప్రోక్షణ కార్యక్రమాలు చేపడతాం. 

Advertisment
Advertisment
తాజా కథనాలు