శ్రీవారి భక్తులకు గుడ్‌ న్యూస్.. ఉన్నత ప్రమాణాలతో వసతి ఏర్పాట్లు

శ్రీవారి భక్తులకు టీటీడీ గుడ్ న్యూస్ తెలిపింది. వీఐపీలతో పాటు సాధారణ భక్తులకు కూడా ఉన్నత ప్రమాణాలతో కూడిన వసతి కల్పించాలని నిర్ణయించారు. మొత్తం రూ.772 కోట్లతో 6,282 గదులకు మరమ్మతులు చేపట్టినట్లు పాలకమండలి సమావేశంలో టీటీడీ ఛైర్మన్ వెల్లడించారు.

New Update
Tirumala Ap

Tirumala Ap Photograph: (Tirumala Ap )

తిరుమల శ్రీవారి భక్తులకు టీటీడీ గుడ్ న్యూస్ తెలిపింది. వీఐపీలతో పాటు సాధారణ భక్తులకు కూడా ఉన్నత ప్రమాణాలతో కూడిన వసతి కల్పించాలని నిర్ణయించినట్లు టీటీడీ ఛైర్మన్ తెలిపారు. రూ.772 కోట్లతో మొత్తం 6,282 గదులకు మరమ్మతులు చేపట్టినట్లు తెలిపారు. తిరుమలలోని అన్నమయ్య భవనంలో జరిగిన పాలకమండలి సమావేశంలో దీంతో పాటు మరికొన్ని  కీలక నిర్ణయాలు తీసుకున్నారు.

ఇది కూడా చూడండి: వీడు మగాడ్రా బుజ్జి.. ఇంపాక్ట్ ప్లేయర్‌గా వచ్చి..జట్టును గెలిపించి!

దేశంలోని అన్ని రాష్ట్రాల్లో టీటీడీ ఆలయాలు..

సైన్స్‌ సిటీకి 15 ఎకరాల కేటాయింపులను రద్దు చేస్తున్నట్లు తెలిపారు. అలాగే దేశ, విదేశాల్లో శ్రీవారి ఆలయాలు నిర్మిస్తామన్నారు. దీనికోసం శ్రీవాణి ట్రస్టుతో పాటు భక్తుల విరాళాల కోసం మరో ట్రస్టును ఏర్పాటు చేస్తామన్నారు. దీని కోసం దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాల సీఎంలు ముందుకు రావాలన్నారు. అయితే టీటీడీలో అందరూ కూడా హిందువులే ప్రాతినిథ్యం వహిస్తారని తెలిపారు.

ఇది కూడా చూడండి: Nicholas Pooran : భయంకరమైన హిట్టర్.. 29 ఏళ్లకే 600 సిక్సులు!

ఇకపై భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా తొందరగా దర్శనం అయ్యేలా ఏఐ సాంకేతికతను ఉపయోగించనున్నారు. అలాగే వీఐపీ బ్రేక్ దర్శనాల వల్ల సామాన్య భక్తులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఉండేందుకు దర్శన సమయాన్ని మార్చనున్నారు. ఉదయం 5.30కి మార్చాలని టీటీడీ ప్లాన్ చేస్తోంది. 

ఇది కూడా చూడండి: AP Man : అమెరికాలో ఆంక్షలు.. ఏపీ యువకుడు ఆత్మహత్య!

దివ్యాంగులు, వృద్ధులు ఆన్‌లైన్‌తోపాటు ఆఫ్‌లైన్‌తో పాటు ఆఫ్‌లైన్‌లో కూడా దర్శనం టికెట్లు బుక్ చేసుకునేలా  మార్పులు చేయాలని అనుకుంటుంది. శ్రీవారికి నాసిరకం సరుకులు అందజేసే వాటిని బ్లాక్ లిస్ట్‌లో పెట్టారు. వారి గతంలో దర్శనాలకు ఇచ్చిన 25,500 కూపన్లు రద్దు చేస్తున్నట్లు కూడా టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. 

ఇది కూడా చూడండి: Betting Apps Anvesh: యూట్యూబర్‌ VR రాజాపై అన్వేష్ ఫైర్.. గడ్డి తింటున్నారంటూ ఆగ్రహం!

Advertisment
తాజా కథనాలు