TTD: రూపురేఖలు మార్చుకోబోతున్న తిరుమల..టీటీడీ ఈవో సంచలన వ్యాఖ్యలు!

తిరుమలను పక్కా ప్రణాళికతో కూడిన మోడల్‌ టౌన్‌గా తీర్చిదిద్దడమే తమ లక్ష్యమని టీటీడీ ఈవో శ్యామలరావు అన్నారు.టీటీడీకి అర్బన్‌ డెవలప్‌మెంట్‌ అండ్‌ టౌన్‌ ప్లానింగ్‌ వింగ్‌ను ఏర్పాటు చేస్తామని ఈవో తెలిపారు.

New Update
TTD 2

Tirumala: తిరుమలను పక్కా ప్రణాళిక తో మోడల్‌ టౌన్‌ గా తీర్చిదిద్దే దిశగా  పనులు జరుగుతున్నట్లు టీటీడీ ఈవో శ్యామలరావు తెలిపారు. తిరుపతిలోని  తిరుపతిలోని పరిపాలన భవనంలోని మీటింగ్‌ హాల్‌లో తిరుమలకు సంబంధించి కీలక ప్రకటన చేశారు. ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన హిందూ ధార్మిక కేంద్రమైన తిరుమలను మోడల్ టౌన్‌గా తీర్చిదిద్దేందుకు ప్రణాళికాబద్ధంగా డిజైన్లు రూపొందించినున్నట్లు  సూచించారు. ఇందుకోసం విజన్ డాక్యుమెంట్ తక్షణావసరం అని, టీటీడీకి అర్బన్ డెవలప్‌మెంట్ అండ్ టౌన్ ప్లానింగ్ వింగ్‌ను ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు.

Also Read: TG: జనవరిలోనే పంచాయతీ ఎన్నికలు.. షెడ్యూల్​ ఖరారు!

తిరుమలలో పాదచారులకు అనుకూలంగా ఫుట్‌పాత్‌లను మార్చడంతో పాటు ట్రాఫిక్ రద్దీని నివారించేందుకు అవసరమైన నిర్మాణాలు, స్మార్ట్ పార్కింగ్ సౌకర్యాలు కల్పించేలా ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు చెప్పారు. కొన్ని పాత కాటేజీలతో పాటు బాలాజీ ఆర్టీసీ బస్టాండ్‌ను కూడా కొత్తగా నిర్మాణం చేయాలని అనుకుంటున్నట్లు తెలిపారు.

Also Read: Telangana: ఇందిరమ్మ ఇళ్లకు ముహుర్తం ఈ నెలాఖరునే!

రాబోయే 25 ఏళ్ల భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని డాక్యుమెంట్ను రూపొందించి దాని ప్రకారం మౌళిక సదుపాయాలు రూపొందించే ఆలోచన ఉందన్నారు. ఇందుకు టౌన్ ప్లానింగ్ లో నిపుణులైన రిటైర్డ్ టౌన్ ప్లానింగ్ ఆఫీసర్‌ను సలహాదారుగా నియమించినట్లు వివరించారు.

Also Read: TG: కలెక్టర్ పై దాడి కేసులో కేసీఆర్, కేటీఆర్.. రూ.10 కోట్ల ఖర్చు.. !

తిరుమలలో మరింతగా ఆధ్యాత్మికత వాతావరణం ఉండేలా ప్రస్తుతం ఉన్న కాటేజీలకు 150 పేర్లు పెట్టి, వాటినే కాటేజీ దాతలు ఎంపిక చేసుకుని పేర్లను మార్చేలా టీటీడీ పాలకమండలి నిర్ణయం తీసుకుందన్నారు. తిరుమలలో పేరుకుపోయిన వ్యర్థాలను కూడా వచ్చే రెండు, మూడు నెలల్లో తొలగించనున్నట్లు ఈవో ప్రకటించారు. తిరుమలలో మరింతగా ఆధ్యాత్మిక శోభ ఉట్టిపడేలా చూడడమే టీటీడీ లక్ష్యం అన్నారు.

Also Read: భారత్‌లో లంచాలు..యూఎస్‌లో కేసులు ఎలా?అదానీని కావాలనే టార్గెట్ చేస్తున్నారా?

తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి వార్షిక బ్ర‌హ్మోత్స‌వాలను నవంబరు 28 నుంచి డిసెంబ‌ర్ 6వ తేదీ వరకు వైభవంగా నిర్వహించేందుకు విస్తృతంగా ఏర్పాట్లు చేపట్టాలని టీటీడీ ఈవో శ్యామ‌ల‌రావు అధికారులను ఆదేశించారు. తిరుప‌తిలోని టీటీడీ ప‌రిపాల‌నా భ‌వ‌నంలో బ్ర‌హ్మోత్స‌వాల ఏర్పాట్లపై అన్ని విభాగాల అధికారులతో ఈవో సమీక్ష సమావేశం ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. తిరుచానూరు బ్ర‌హ్మోత్స‌వాల్లో ప్ర‌ధాన ఘ‌ట్ట‌మైన పంచ‌మి తీర్థం రోజు భ‌క్తుల‌కు మంచి ఏర్పాట్లు చేయాల‌ని తెలిపారు.

హోల్డింగ్ పాయింట్ల‌లో ఉండే వేచి ఉండే భక్తుల‌కు సౌక‌ర్య‌వంతంగా మంచినీరు, అల్పాహారంతో పాటు మ‌రుగుదొడ్ల‌ను కూడా అందుబాటులో ఉంచేందుకు ముంద‌స్తుగానే ప్ర‌ణాళిక చేయాలన్నారు. హోల్డింగ్ పాయింట్ల వ‌ద్ద అవ‌స‌ర‌మైన సిబ్బందిని అందుబాటులో ఉంచాల‌న్నారు.

ఆరోగ్యశాఖ అధికారులు పారిశుద్ధ్యం విష‌యంలో జాగ్ర‌త్త‌లు తీసుకుని స్థానిక పంచాయ‌తీ అధికారుల‌తో స‌మ‌న్వ‌యం చేసుకోవాల‌న్నారు. వైద్య విభాగం అధికారులు ప్ర‌థ‌మ చికిత్స కేంద్రాల‌ను, అంబులెన్సుల‌ను ఏర్పాటు చేసి అవ‌స‌ర‌మైన సిబ్బందిని అందుబాటులో ఉంచాల‌న్నారు. సెక్యూరిటీ విభాగం అధికారులు సీసీ కెమెరాల‌ను, అవ‌స‌ర‌మైనంత సిబ్బందిని ఏర్పాటు చేసుకుని స్థానిక పోలీసుల‌తో స‌మ‌న్వ‌యం చేసుకోవాల‌ని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. భ‌క్త‌లంద‌రికీ అన్న‌ప్ర‌సాదం విరివిగా అందేలా చ‌ర్య‌లు చేప‌ట్టాల‌ని తెలిపారు.

 

Advertisment
Advertisment
తాజా కథనాలు