ఏపీలో విషాదం.. జలపాతంలో ముగ్గురు వైద్య విద్యార్థులు గల్లంతు ఏపీలోని అల్లూరి జిల్లా మారేడుమిల్లి సమీపంలో జలతరంగిణి జలపాతంలో ప్రమాదం జరిగింది. జలపాతాన్ని చూసేందుకు వచ్చిన 14 మంది వైద్య విద్యార్థుల్లో అయిదుగురు నీటిలో కొట్టుకపోయారు. స్థానికులు ఇద్దరిని కాపాడగా మరో ముగ్గురు గల్లంతయ్యారు. By B Aravind 22 Sep 2024 | నవీకరించబడింది పై 23 Sep 2024 08:09 IST in ఆంధ్రప్రదేశ్ వైజాగ్ New Update షేర్ చేయండి ఏపీలోని అల్లూరి జిల్లా మారేడుమిల్లి సమీపంలో జలతరంగిణి జలపాతంలో విషాదం చోటుచేసుకుంది. జలపాతం చూసేందుకు వచ్చిన ముగ్గురు వైద్య విద్యార్థులు గల్లంతవ్వడం కలకలం రేపుతోంది. ఇక వివరాల్లోకి వెళ్తే.. ఏలూరు జిల్లాలోని ఓ మెడికల్ కాలేజీ నుంచి 14 మందికి పైగా వైద్య విద్యార్థులు జలపాతం వీక్షించేందుకు వచ్చారు. అయితే అయిదుగురు విద్యార్థులు ప్రమాదవశాత్తు ఆ జలపాతంలో కొట్టుకుపోయారు. స్థానికులు ఇద్దరిని కాపాడగా మరో ముగ్గురి ఆచూకి కనిపించలేదు. ప్రస్తుతం వారికోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. గల్లంతైన వారిలో ఇద్దరు యువతులు, ఒక యువకుడు ఉన్నారు. Also Read: లడ్డూ వివాదంపై టీటీడీ కీలక నిర్ణయం.. నెయ్యి ట్యాంకర్లకు జీపీఎస్! #medical-students #andhra-pradesh #telugu-news #waterfall సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి