Girl Death Mystery: రామచంద్రపురం బాలిక మృతి కేసులో వీడిన మిస్టరీ..నిందితుడు ఎవరంటే?

అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఈ నెల 4 న జరిగిన చిన్నారి రంజిత అనుమానాస్పద మృతి కేసులో సంచలన విషయాలు వెలుగు చూశాయి. చిన్నారి ఆత్మహత్యకు పాల్పడినట్లు మొదట అనుమానించినప్పటికీ  పోస్టుమార్టం, ఫోరెన్సిక్ ల్యాబ్ నివేదిక ఆధారంగా చిన్నారిది హత్యగా నిర్ధారించారు.

New Update
FotoJet - 2025-11-09T125625.387

The mystery left in the Ramachandrapuram girl's death case

Girl Death Mystery : అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఈ నెల 4 న జరిగిన చిన్నారి రంజిత అనుమానాస్పద మృతి కేసులో సంచలన విషయాలు వెలుగు చూశాయి. విచారణను పోలీసులు వేగవంతం చేసి నిందితున్ని గుర్తించారు. చిన్నారి ఆత్మహత్యకు పాల్పడినట్లు మొదట అనుమానించినప్పటికీ  పోస్టుమార్టం, ఫోరెన్సిక్ ల్యాబ్ నివేదిక ఆధారంగా చిన్నారిది హత్యగా నిర్ధారించారు. రంజిత వాళ్ళు ఉంటున్న ఇంటి కింద ఫ్లోర్ లో కోటి అనే యువకుడు ఇంటర్నెట్ షాప్ నిర్వహిస్తున్నాడు. కాగా అతనికి యూట్యూబ్ చానల్లో పని చేస్తున్న  శ్రీను అనే యువకుడు స్నేహితుడు.. శ్రీను రెగ్యులరుగా స్నేహితుడు కోటి షాప్ దగ్గరికి వస్తూ ఉండేవాడు.. ఈ క్రమంలో శ్రీనుతో రంజిత కుటుంబానికి పరిచయం అయింది. ఆ పరిచయంతో అప్పుడప్పుడు శ్రీను వారింటికి వెళ్లేవాడని తెలుస్తోంది. అంతేకాక రంజిత తల్లి సునీతతో శ్రీను తరుచుగా ఫోన్‌లో మాట్లాడుకునేవారని తెలుస్తోంది. తాను ఇంట్లో లేని సమయంలో చిన్నారికి కావాల్సిన ఐటమ్స్ తెచ్చి ఇమ్మని సునీత చెప్పేది.. రంజిత హత్య జరిగిన రోజుకూడా పై ఫ్లోరులో ఉంటున్న సునీత వాళ్ళ ఇంటికి వెళ్లిన శ్రీను.. రంజిత తల్లి సునీతతో ఫోన్ లో మాట్లాడినట్లు తేలింది.  

అయితే, ఫ్యాన్ రిపేర్ అయిందని సునీత ఇంటికి వచ్చిన శ్రీను చున్నీ మెడకు బిగించి రంజితను చంపినట్లు పోలీసులు గుర్తించారు. తనపై అనుమానం రాకుండా విచారణకు వచ్చిన పోలీసులతో అతడు తిరిగినట్లు సమాచారం. అలాగే, లోకల్ వాట్సాప్ గ్రూపుల్లో నిందితులను త్వరగా పట్టుకోవాలని మెసేజ్‌లు కూడా శ్రీను పెట్టిన చాట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అయితే శ్రీనుకు, సునీతకు మధ్య ఉన్న సంబంధం నేపథ్యంలోనే ఈ హత్య జరిగిందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వారి మధ్య పాపను అడ్డు తొలగించుకునే క్రమంలోనే ఈ హత్య జరిగినట్లు తెలుస్తోంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

 అసలేం జరిగిందంటే..

అంబేడ్కర్ కోన‌సీమ జిల్లా రామచంద్రపురం పట్టణంలో పదేళ్ల బాలిక రంజిత (హనీ) ఇంట్లో ఎవరూ లేని సమయంలో చున్నీతో ఉరేసుకుని అనుమానస్పద స్థితిలో ఆత్మహత్య చేసుకుంది. ఈమె మరణం స్థానికంగా సంచ‌ల‌నం రేపింది. మంగ‌ళ‌వారం పాఠ‌శాల నుంచి ఇంటికి వ‌చ్చిన చిన్నారి రంజిత ఇంట్లోనే ఫ్యాన్‌కు ఉరివేసుకుని విగ‌త జీవిగా క‌నిపించింది. రామ‌చంద్రపురంలోని ఓ ప్రైవేటు స్కూల్‌లో అయిదో త‌ర‌గ‌తి చ‌దువుతున్న చిన్నారి రంజిత స్కూల్ టీచ‌ర్లు ఒత్తిడి కార‌ణంగానే ఆత్మ హ‌త్యకు పాల్పడింద‌ని అంతా భావించారు. అయితే త‌ల్లి త‌న కుమార్తె మృతిపై అనుమానాలున్నాయ‌ని ఆరోపించ‌డంతో ఆ దిశగా కేసు న‌మోదు చేసిన పోలీసులు ద‌ర్యాప్తు ప్రారంభించారు. తన కుమార్తె మృతిలో వారు అద్దెకు ఉంటున్న ఇంటి య‌జ‌మాని కుమారుడు జాకీర్ హుస్సేన్ పాత్రపై అనుమానం వ్యక్తం చేసిన క్రమంలోనే పోలీసులు అత‌న్నిఅదుపులోకి తీసుకుని విచారించారు.

కాగా సునీత రామ‌చంద్రపురం ప్రభుత్వ ఆసుప‌త్రిలో స్టాప్‌న‌ర్స్‌గా ప‌ని చేస్తుంది. సిర్రా సునీత ఉద్యోగ రీత్తా రామ‌చంద్రపురంలో టి.న‌గ‌ర్ క‌మ‌ల్ కాంప్లెక్స్‌లో అద్దెకు ఉంటోంది. భ‌ర్త ముంబైలో ఉంటుండ‌గా వీరికి ఇద్దరు కుమార్తెలు. పెద్దకుమార్తె హాస్టల్‌లో చ‌దువుకుంటుండ‌గా మృతి చెందిన బాలిక రంజిత స్థానిక ఓ ప్రైవేటు స్కూల్‌లో 5వ త‌ర‌గ‌తి చ‌దువుతుంది.. మంగ‌ళ‌వారం కాకినాడ వెళ్లిన త‌ల్లి సునీత‌ ఇంటికి వ‌చ్చేసరికి ఇంటి గ‌ది త‌లుపు లోప‌ల‌ గ‌డియ పెట్టి ఉండ‌డంతో అందర్నీ పిలిచి తలుపులు బద్దలు కొట్టి చూడగా ఇంట్లో ఫ్యాన్‌కు ఉరికి వేళాడుతూ విగ‌త జీవిగా క‌నిపించింది చిన్నారి రంజిత‌. ఉరి నుంచి దింపి చిన్నారిని హుటాహుటీన ఏరియా ఆసుప‌త్రికి త‌రలించారు. అప్పటికే చిన్నారి రంజిత మృతిచెందిన‌ట్లు వైద్యులు దృవీక‌రించారు. దీంతో కేసు విచారణలో భాగంగా శ్రీను బాలికను హత్య చేసినట్లు తేల్చారు. అయితే హత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.

Advertisment
తాజా కథనాలు