Crime News : ఆస్ట్రేలియాలో దారుణం.. చెత్త కుండీలో హైదరాబాదీ మహిళ మృతదేహం లభ్యం!
ఆస్ట్రేలియా విక్టోరియాలో హైదరాబాద్కు చెందిన చైతన్య దారుణ హత్యకు గురయ్యింది. మౌంట్ పొల్లాక్ రోడ్డు పక్కన ఓ చెత్తబుట్టలో చైతన్య మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. బాధితురాలు హైదరాబాద్-ఏఎస్రావు నగర్ వాసి. ఈ కేసులో విచారణకు హాజరుకావాలంటూ భర్త అశోక్ రాజ్ ను పోలీసులు ఆదేశించారు.