తెలంగాణ టెన్త్ ఫలితాల విడుదల షెడ్యూల్ లో అధికారులు మార్పులు చేశారు. ముందుగా విడుదల చేసిన ప్రకటన ప్రకారం ఈ రోజు మధ్యాహ్నం 1 గంటలకు సీఎం రేవంత్ రెడ్డి రవీంద్ర భారతిలో ఫలితాలను విడుదల చేయాల్సి ఉంది. కానీ.. 2.15 గంటలకు కార్యక్రమాన్ని రీషెడ్యూల్ చేశారు. అయితే.. సీఎం రేవంత్ రెడ్డి ఈ రోజు విజయవాడలో జరుగుతున్న ఏపీ మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు కుమారుడు వివాహ వేడుకకు హాజరయ్యారు. వివాహానికి హాజరుకావడం కోసమే ఫలితాల విడుదల ఆలస్యం చేస్తున్నారని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఈ మేరకు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు ఆయా పార్టీల మద్దతుదారులు.
Telangana SSC 2025 results delayed, new announcement time set for 2:15 PM
— Telangana Today (@TelanganaToday) April 30, 2025
The SSC Public Examinations 2025 results announcement has been delayed.
The results, which are supposed to be released at 1 pm on Wednesday, will now be declared at 2.15 pm today.
The change in the… pic.twitter.com/oK8DhcAKM3
ఈ వెబ్ సైట్లలో ఫలితాలు..
ఫలితాల వెల్లడి అనంతరం ప్రభుత్వ అధికారిక వెబ్‌సైట్ bse.telangana.gov.in లేదా results.bse.telangana.gov.in లలోనూ ఫలితాలను చెక్ చేసుకోవచ్చు. కాగా రాష్ట్ర వ్యాప్తంగా ఈ పరీక్షలు మార్చి 21వ తేదీ నుంచి ఏప్రిల్ 2వ తేదీ వరకు నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ పరీక్షలకు దాదాపు 5 లక్షల మంది విద్యార్ధులు హాజరయ్యారు. ఇక ఏప్రిల్ 15వ తేదీ నాటికే జవాబు పత్రాల మూల్యాంకనం కూడా పూర్తైంది. కానీ ఇప్పటి వరకు ఫలితాలు వెల్లడికాకపోవడంతో విద్యార్ధుల్లో ఆందోళన నెలకొంది.
ఈసారి పదో తరగతి విద్యార్ధులకు గ్రేడ్స్ ఇవ్వడానికి బదులు గతంలో మాదిరి విద్యార్ధులకు మార్కులను మంజూరు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకు సంబంధించి విధివిధాలను రూపొందించడంలో జాప్యం నెలకొనడం మూలంగా టెన్త్ ఫలితాల వెల్లడి ఆలస్యమైంది. ఈ రోజు విడుదలయ్యే ఫలితాల్లో విద్యార్ధులకు వచ్చిన మార్కులతో పాటు సబ్జెక్టుల వారీగా గ్రేడ్స్ కూడా ప్రకటించనున్నారు.
(cm-revanth-reddy | 10th-results | telugu-news | telugu breaking news)