/rtv/media/media_files/2025/11/10/suspicious-death-of-a-student-in-kadapa-district-2025-11-10-16-15-34.jpg)
Suspicious death of a student in Kadapa district
KADAPA TENSION : కడప శ్రీ చైతన్య స్కూల్ హాస్టల్‌లో ఒక విద్యార్థిని సోమవారం ఉదయం ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. 9వ తరగతి చదువుతున్న జశ్వంతి ఆత్మహత్యపై మృతురాలి తల్లిదండ్రులకు సరైన సమాచారం ఇవ్వకుండా స్కూల్ యాజమాన్యం రిమ్స్ ఆస్పత్రికి తరలించడంపై బంధువులు ఆందోళన వ్యక్తం చేశారు.జశ్వంతి మృతిపై పేరెంట్స్ ఆందోళన వ్యక్తం చేయడంతో పాటు ఆమె మృతిపై పేరెంట్స్ అనుమానం ఉన్నట్లు తెలిపారు.
తమ కుమార్తె పరిస్థితిపై ముందుగా సమాచారం ఇవ్వకుండా ఆస్పత్రికి ఎలా తరలించారని వారు యజమాన్యాన్ని వారు ప్రశ్నించారు.
Also Read: 'కే ర్యాంప్' ఎంటర్టైన్మెంట్..! ఇప్పుడు ఓటీటీలోకి.. స్ట్రీమింగ్ ఎక్కడంటే...?
తల్లిదండ్రులకు సమాచారం ఇవ్వకుండా..మృతదేహం రిమ్స్ తరలించడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగా, ఈ సందర్భంగా పోస్టుమార్టం గదిలోకి చొరబడేందుకు పేరెంట్స్ యత్నించారు. మార్చురీ తలుపులు బద్దలు కొట్టిన బంధువులు..ఫ్రీజర్ డోర్ బద్దలు కొట్టిన బంధువులు బాలిక మృతదేహాన్ని తీసుకెళ్లారు.బంధువులు మృతదేహాన్ని తీసుకుని స్కూల్ వద్దకు వెళ్లి ఆందోళనకు దిగారు. రింగ్‌రోడ్డుపై బంధువుల ఆందోళనతో ట్రాఫిక్ నిలిచిపోయింది. సమాచారం అందుకున్న వన్ టౌన్ పోలీసులు కేసు నమోదు చేసి ఆ బాలిక ఆత్మహత్యకు దారి తీసిన కారణాలపై దర్యాప్తు చేపట్టారు.
Also Read: హోం ఫుడ్‌తో 'ఫౌజీ' సెట్స్‌లో ప్రభాస్ సందడి.. ఫొటోస్ షేర్ చేసిన ఇమాన్వి!
కాగా, అయితే జశ్వంతి స్కూల్ లో అనారోగ్యానికి గురికావడంతో మేనేజ్ మెంట్ రిమ్స్‌కు తరలించినట్లు తెలిపింది. అయితే అప్పటికే మృతిచెందినట్టు వైద్యులు డిక్లేర్ చేశారు. అయితే తమ కుమార్తె మృతిపై తల్లిదండ్రులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. మొదట కళ్లు తిరిగి పడిపోయిందని.. ఆ తర్వాత ఉరి వేసుకుని చనిపోయిందని సమాచారం ఇచ్చారంటున్నారు తల్లిదండ్రులు. తమ కుమార్తెను యాజమాన్యం చంపిందని ఆరోపిస్తున్నారు. అసలు మా అమ్మాయి ఎందుకు ఊరి వేసుకుంది.. నా కూతురు ఎంతో ధైర్యంగా ఉంటూ.. చదువులో ఎంతో చురుకుగా ఉంటుంది. అయినప్పటికి అసలు ఆత్మహత్య చేసుకోవాల్సిన పిరికిది కాదు అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో విద్యార్థిని మృతిపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీనిపై ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Follow Us