Guillain Barre Syndrome : భయపెడుతున్న జీబీఎస్.. లక్షణాలివి

ఇప్పటికే తెలుగు రాష్ట్రాలు బర్డ్‌ఫ్లూతో భయపడుతోన్నాయి. మరోవైపు గులియన్ బారే సిండ్రోమ్ తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. మహారాష్ట్ర, కేరళ, పశ్చిమ బెంగాల్‌లలో ఈ వ్యాధి ఇప్పటికే తీవ్ర కలవరం పుట్టించింది. ఈ సిండ్రోమ్ తో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లో ఒక్కో మహిళ మరణించారు.

New Update
 Guillain Barre Syndrome

Guillain Barre Syndrome

Guillain Barre Syndrome : ఇప్పటికే తెలుగు రాష్ట్రాలు బర్డ్‌ఫ్లూతో భయపడుతోన్నాయి. మరోవైపు గులియన్ బారే సిండ్రోమ్ తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. మహారాష్ట్ర, కేరళ, పశ్చిమ బెంగాల్‌లలో ఈ వ్యాధి ఇప్పటికే తీవ్ర కలవరం పుట్టించింది. ఇటీవల ఇది తెలంగాణలో ప్రవేశించిన ఈ సిండ్రోమ్ తో ఒక మహిళ మరణించగా అనంతరం ఆంధ్రప్రదేశ్‌లోకి ఎంటరయింది. .ఏపీలో ప్రస్తుతం 17 గులియన్ బార్రే సిండ్రోమ్ (జీబీఎస్) కేసులు నమోదు అయ్యాయని వైద్యారోగ్య శాఖ ప్రకటించింది. కాగా ఈరోజు కమలమ్మ అనే మహిళ జీబీఎస్ లక్షణాలతో చనిపోవడం ఆందోళన కలిగిస్తోంది.

Also Read: అమెరికా నుంచి ఇజ్రాయిల్‌కు చేరుకున్న MK-84 బాంబులు.. ఏ క్షణమైనా యుద్ధం..!

ఈ జీబీఎస్ ఏంటంటే....


గులియన్ బారే సిండ్రోమ్ అనేది నరాలకు సంబంధించిన వ్యాధి. చాలా అరుదుగా లక్ష మందిలో ఒకరిద్దరికి మాత్రమే వస్తుంటుందని వైద్యులు చెప్తున్నారు. అయితే రాష్ట్రంలో ఇటీవల ఒక్కసారిగా కేసులు పెరగడంతో ఆందోళన వ్యక్తమవుతోంది. గుంటూరుతో పాటుగా ఏలూరు, ప్రకాశం, పల్నాడు, కాకినాడ జిల్లాలలో జీబీఎస్ కేసులు నమోదయ్యాయి. జీబీఎస్ అంటువ్యాధి కాకపోయినా.. అప్రమత్తంగా ఉండాలని వైద్యులు చెప్తున్నారు. జీబీఎస్ ఒక రకంగా పక్షవాతం లాంటిదేనని.. ఇతర ఇన్‌ఫెక్షన్లు వచ్చినవారికే మొదలవుతుందని చెప్తున్నారు. కలుషితమైన నీరు, ఆహారం ద్వారా వ్యాపిస్తుందని వైద్యులు చెప్తున్నారు. ఈ వ్యాధి తీవ్రమైతే కండరాలు చచ్చుబడిపోతాయని.. లక్షణాలను సకాలంలో గుర్తించి చికిత్స తీసుకుంటే కోలుకోవచ్చని చెప్తున్నారు.

Also Read: వారి సాయం లేకుండా మేం బతకడం కష్టమే.. జెలెన్‌స్కీ సంచలన వ్యాఖ్యలు

 వ్యాధి లక్షణాలు


వేళ్లు, మడమలు, మణికట్టు వంటి ప్రాంతాలతో సూదులతో పొడిచినట్లు అనిపించడంతో పాటుగా కాళ్లనొప్పులు ఉంటాయని వైద్యులు చెప్తున్నారు. అలాగే కాళ్లలో మొదలైన బలహీనత పైకి విస్తరిస్తూ ఉంటుందని.. కాళ్లు, చేతులు తిమ్మిర్లు ఎక్కుతుంటాయని చెప్తున్నారు. సరిగ్గా నడవలేకపోవటం, తూలటం జరుగుతూ ఉంటుందంటున్నారు. ఏదైనా నమలడం, మాట్లాడటంలో ఇబ్బందిగా ఉండటంతో పాటుగా నోరు వంకరపోవటం వంటి లక్షణాలు కనిపిస్తాయని వైద్యులు చెప్తున్నారు. జీబీఎస్ వ్యాధి తీవ్రమైతే శ్వాస తీసుకోవడానికి కూడా ఇబ్బంది పడతారని.. రక్తపోటులో హెచ్చుతగ్గులు వస్తాయని వైద్యులు చెప్తున్నారు. ఒళ్లంతా తిమ్మిరిగా అనిపించడం, కండరాలు బలహీనంగా మారడం, డయేరియా, పొత్తి కడుపు నొప్పి, జ్వరంతోపాటు వాంతులు అవుతాయని వైద్యులు చెబుతున్నారు. కలుషిత ఆహారం, నీటి ద్వారా ఈ బ్యాక్టీరియా సోకుతుందని అంటున్నారు. ఈ వ్యాధి ముఖ్యంగా పిల్లలు, వృద్ధులపైనే తీవ్ర ప్రభావం చూపుతుంది. నాడీ వ్యవస్థను ఈ వైరస్‌ దెబ్బతీస్తుంది. దీంతో రోగి పక్షవాతం బారిన పడతాడు. అయితే సకాలంలో వైద్యం అందితే ముప్పు ఉండదని పేర్కొంటున్నారు.

Also Read: ఒకే కుటుంబంలో ముగ్గురు మృతి.. శవాలతో రెండ్రోజులు ఉన్న వృద్ధురాలు

నివారణ


కాచి చల్లార్చిన నీటినే తాగాలని, మాంసాన్ని బాగా ఉడికించాలని వైద్యులు సూచిస్తున్నారు. అలాగే కూరగాయలు, పండ్లను ఒకటికి రెండుసార్లు నీటితో శుభ్రపరిచిన తర్వాతనే తినాలంటున్నారు. పరిసరాల పరిశుభ్రతతో పాటుగా వ్యక్తిగత శుభ్రతకు ప్రాధాన్యమివ్వాలని సూచిస్తున్నారు.

Also Read: రండి.. రండి.. పానీ పూరీ తింటే రూ.21 వేల ప్రైజ్‌మనీ.. ఎగబడుతున్న కస్టమర్స్!

Advertisment
తాజా కథనాలు